iDreamPost
android-app
ios-app

వైసీపీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతికి తృటిలో తప్పిన ప్రాణాపాయం.. అసలు ఏమైందంటే?

వైసీపీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతికి తృటిలో తప్పిన ప్రాణాపాయం.. అసలు ఏమైందంటే?

అనంతపురం జిల్లా సింగనమల వైసీపీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతికి తృటిలో ప్రాణాపాయం తప్పింది. ఆమె ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురి కావడంతో కారు పూర్తి స్థాయిలో దెబ్బ తిన్నది. రోడ్డు ప్రమాదం నిన్న రాత్రి జరగగా ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అనంతపురం జిల్లా అనంతపురం శివారులో ఉన్న సోమలదొడ్డి ఇస్కాన్ టెంపుల్ కి దర్శనం నిమిత్తం వెళ్లారు పద్మావతి. దర్శనం ముగించుకుని రాత్రివేళ తిరుగు ప్రయాణం అయిన తర్వాత ఈ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది..

సోమలదొడ్డి వద్ద ఎమ్మెల్యే వాహనం నేషనల్ హైవే మీదకు వెళుతున్న సమయంలో వెనుకగా వచ్చిన ఒక కారును బలంగా ఢీకొంది.. అయితే ఆ కారు స్పీడ్ ధాటికి రెండు కార్లు కూడా బాగా డామేజ్ అయ్యాయి. అయితే ఆనందించవలసిన విషయం ఏమిటంటే ప్రమాదానికి కారణమైన కారులో గాని ఎమ్మెల్యే కారులో కానీ ఎవరికీ గాయాలు కాకపోవడమే. ప్రమాద సమయంలో ఎమ్మెల్యే వాహనంలో ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి సహా డ్రైవర్ ఆమె గన్మెన్ ఉన్నారు. ఇక ప్రమాదానికి కారణమైన ఫోర్డ్ ఫిగో కారులో డ్రైవర్ సహా మరో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఫోర్డ్ ఫిగో వాహనం ఎయిర్ బ్యాగ్స్ తెచ్చుకోవడంతో వారికి కూడా గాయాలు కాలేదు.

ఇక ఎమ్మెల్యే గన్మెన్ సమాచారంతో పద్మావతి కారు యాక్సిడెంట్ ఘటన మీద అనంతపురం రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే పద్మావతి కారు యాక్సిడెంట్ అయింది అనే విషయం తెలుసుకున్న తర్వాత అభిమానులు కాస్త కంగారు పడినా ప్రమాదంలో ఎలాంటి గాయాలు కాలేదని తెలిసి ఊపిరిపీల్చుకున్నారు. 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి యామిని బాల మీద వైసీపీ తరపున పోటీ చేసిన పద్మావతి అతి తక్కువ ఓట్ల మెజారిటీతో పరాజయం పాలయ్యారు. తర్వాత 2019 ఎన్నికల్లో యామిని బాలను తప్పించి బండారు శ్రావణికి టిడిపి టికెట్ ఇచ్చినా సరే జొన్నలగడ్డ పద్మావతి దాదాపు లక్ష 18 ఓట్లు సాధించి ప్రత్యర్థులు కనీసం దరిదాపుల్లో కూడా లేకుండా గెలుపు బావుటా ఎగురవేశారు.

Also Read : మేనక, వరుణ్ గాంధీ లను బీజేపీ ఎందుకు దూరం పెట్టింది..?