iDreamPost
android-app
ios-app

అమ్నీషియా పబ్ ఘటన మరువకముందే.. హైదరాబాద్ లో మరో దారుణం

  • Published Jun 05, 2022 | 11:52 AM Updated Updated Jun 05, 2022 | 11:52 AM
  • Published Jun 05, 2022 | 11:52 AMUpdated Jun 05, 2022 | 11:52 AM
అమ్నీషియా పబ్ ఘటన మరువకముందే.. హైదరాబాద్ లో మరో దారుణం

హైదరాబాద్ లో రెండ్రోజుల క్రితం జరిగిన అమ్నీషియా పబ్ కేసు ఘటన మరువకుండానే.. మరో దారుణం వెలుగులోకొచ్చింది. ఓ క్యాబ్ డ్రైవర్ మైనర్ బాలికను కిడ్నాప్ చేసి.. ఒక రాత్రంతా రహస్య ప్రాంతంలో దాచి.. ఉదయాన్నే బాలికను ఇంటివద్ద విడిచిపెట్టాడు. వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ పరిధిలోని మొఘల్ పురాలో మైనర్ బాలిక (13)ను ఓ క్యాబ్ డ్రైవర్ కిడ్నాప్ చేశాడు. రాత్రంతా బాలికను వేరేచోట ఉంచి ఉదయాన్నే ఇంటివద్ద విడిచిపెట్టాడు.

ఈ ఘటనపై బాలిక తల్లిదండ్రుులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు క్యాబ్ డ్రైవర్ సహా.. ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఉదయం వరకూ కూతురు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా..మిస్సింగ్ కేసు నమోదు చేశారు. ఉదయానికి బాలిక ఇంటికి రావడంతో.. ఆమె నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. లుక్మాన్ అనే క్యాబ్ డ్రైవర్ తనను రంగారెడ్డి జిల్లాలోని ఏదో ఊరికి తీసుకెళ్లాడని బాలిక తెలిపింది. దీంతో మిస్సింగ్ కేసును కిడ్నాప్ కేసుగా మార్చారు. కాగా.. బాలికను లుక్మాన్ రంగారెడ్డి జిల్లా కొందుర్గ్ గ్రామానికి తీసుకెళ్లి.. అక్కడ తెలిసిన వ్యక్తులతో ఉంచినట్లు విచారణలో వెల్లడైంది. దాంతో లుక్మాన్ కు ఆశ్రయం ఇచ్చిన వారిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ఘటన నాలుగురోజుల క్రితం జరగ్గా.. పోలీసులు గోప్యత పాటించారు.

Jojobet GirişjojobetMadridbetJojobetJojobetjojobetJojobetlunabetfixbetjojobetsüpertotobetsüpertotobetjojobetjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet girişgrandpashabet