sai
sai
ప్రస్తుతం దేశంలో కొంత మందినే లక్ష్యంగా చేసిన పౌరసత్య సవరణ చట్టం భవిష్యత్‌లో అందరికీ ఇబ్బందులు తెచ్చిపెడుతుందని ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్ధీన్ ఓవైసీ అన్నారు. ఈ వ్యవహారంలో కేంద్రానికి మద్దతు ఇచ్చిన వైస్సార్‌సీపీ అధ్యుక్షుడు వైఎస్ జగన్ తన నిర్ణయంపై పునరాలోచన చేయాలని కోరారు. ఈ విషయంలో కేంద్ర నిర్ణయాన్ని వ్యతిరేకించిన తెలంగాణ సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
దేశ వ్యాప్తంగా ఆయా ప్రాంతాలలో విద్యార్థులపై పోలీసులు చేపట్టిన లాఠీ చార్జి అమానుషమన్నారు. కాల్పులు జరపడాన్ని ఖండించారు. వచ్చే ఏడాది మహాత్మా గాంధీ, భగత్ సింగ్ వర్థంతులు, డా. బీఆర్ అంబేడ్కర్ జయంతి రోజులను రాజ్యాంగ పరిరక్షణ దినాలుగా నిర్వహిస్తామని హైదరాబాద్‌లో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ప్రకటించారు.