iDreamPost
android-app
ios-app

మనం తినే ఉప్పు, చక్కెర ఇంత డేంజరా? బయట పడ్డ సంచలన విషయాలు!

  • Published Aug 14, 2024 | 8:52 AM Updated Updated Aug 14, 2024 | 8:52 AM

Microplastics in Salt and Sugar: ఉదయం లేచిన మొదలు పడుకునే వరకు మనం తినే ఆహారంలో ఉప్పు, చక్కెర ఏదో ఒక రూపంలో తీసుకుంటాం. భవిష్యత్ లో ఇవి ఎంతో ప్రమాదం అని తాజా అధ్యాయణాల్లో వెలువడింది. వివరాలు ఏంటో చూద్దాం.

Microplastics in Salt and Sugar: ఉదయం లేచిన మొదలు పడుకునే వరకు మనం తినే ఆహారంలో ఉప్పు, చక్కెర ఏదో ఒక రూపంలో తీసుకుంటాం. భవిష్యత్ లో ఇవి ఎంతో ప్రమాదం అని తాజా అధ్యాయణాల్లో వెలువడింది. వివరాలు ఏంటో చూద్దాం.

మనం తినే ఉప్పు, చక్కెర ఇంత డేంజరా? బయట పడ్డ సంచలన విషయాలు!

ఇటీవల అసలు కంటే నకిలీలే బాగా ఆకట్టుకుంటున్నాయి. అంతేకాదు తక్కువ ధరకు లభిస్తున్నాయని వినియోదారులు వాటీకే ఎక్కువ ప్రాధాన్య ఇస్తున్నారు.ఉదయం పాల నుంచి మొదలు పడుకునే సమయంలో వాడే దోమల మందు వరకు ప్రతిదాంట్లో కల్తీ జరుగుతుందని అంటున్నారు. అందమైన ప్యాకింగ్, ఆకట్టుకునే ఆఫర్లతో కల్తీ సరుకులు మార్కెట్లో ఇట్టే సేల్ అవుతున్నాయి. వీటి వల్ల రుచి సంగతి దేవుడు ఎరుగు, ఆరోగ్యానికి ముప్ప తప్పదు. ఉప్పు, చక్కెర్ మన నిత్యావసర ఆహార పదార్ధాలు. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ఏదో ఒక రూపంలో వీటిని వాడుతూనే ఉంటాం. తాజాగా ఉప్పు, చక్కెర్ బ్రాండ్లలో మైక్రో ప్లాస్టీక్స్ ఉన్నాయని తాజా అధ్యయనంలో వెల్లడైంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

భారతీయ మార్కెట్లో ప్యాక్‌డ్, అన్ ప్యాక్‌డ్ లో లభించే ఉప్పు, చక్కెర్ బ్రాండ్‌లలో మైక్రో ప్టాస్టీక్స్ ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. మంగళవారం టాక్సిక్స్ లింక్ అనే పర్యావరణ హిత సంస్థ రిలీజ్ చేసిన ‘మైక్రో ప్టాస్టీక్స్ ఇన్ సాల్ట్ అండ్ షుగర్’ నివేదికలో సంచలన విషయాలు వెల్లడించారు. టేబుల్ సాల్ట్, రాక్ సాల్ట్, సీ సాల్ట్, రా సాల్ట్ తో పాటు ఐదు రకాల చక్కరలను సంస్థ పరిశీలించగా అన్ని శాంపిళ్లలో 0.1 ఎంఎం నుంచి 5 ఎంఎం పరిమాణం కలిగిన మట్టిబెడ్డలు, ఫైబర్, ఫిల్మ్స్ బయటపడ్డాయని నివేధికలో తెలిపింది. అత్యధికంగా అయోడైజ్‌డ్ ఉప్పులో పలు రకాల ఫైబర్, ఫిల్మ్ మైక్రోప్లాస్టీక్స్ ఎక్కువగా కనిపించాయని నివేదిక వెల్లిడించింది. ఒక కిలో ఉప్పులో 6.71 నుంచి 89.15 మైక్రో ప్లాస్టీక్ ముక్కలు ఉన్నాయని వివరించింది. ఆర్గానిక్ ఉప్పులో 6.70 మైక్రోప్లాస్టీక్ ముక్కలు, అయోడైజ్‌డ్ ఉప్పులో 89.15 మైక్రోప్లాస్టీక్ ముక్కలు ఉన్నట్లు నివేధికలు వెలువడింది.

Plastic in salt and sugar!

భారతీయులు సగటున ప్రతిరోజూ 10.98 గ్రాముల ఉప్పు, 10 చెంచాల వరకు చక్కెర తీసుకుంటారని గతంలో నిర్వహించిన సర్వేల్లో వెల్లడైంది. మైక్రో ప్లాస్టీక్ ఆరోగ్యానికి, పర్యవరణానికి తీవ్ర నష్టం కలగజేస్తున్నాయి. మనిషి ఊపిరితిత్తులు, గుండెతో పాటు తల్లిపాలు, గర్భస్థ శిశువుల్లో మైక్రో ప్లాస్టిక్స్ ఉన్నట్లు సంస్థ జరిపిన పరిశోధనలో వెల్లడైంది. మైక్రో ప్లాస్టీక్స్ పై శాస్త్రీయ డేటాబేస్ కు తగినంత సమాచారం జోడించడానికి తాము అధ్యయనం చేశామని టాక్సిక్స్ లింక్ ఫౌండర్ – డైరెక్టర్ రవి అగర్వాల్ తెలిపారు. దీని ద్వారా అంతర్జాతీయంగా మైక్రో ప్లాస్టిక్ పై పోరాటం నిర్ధిష్ట చర్యలు తీసుకునే అవకాశ ఉంటుందని ఆయన అన్నారు. మనం నిత్యం తప్పని సరిగా వాడుతున్న ఉప్పు, చక్కెరలో మైక్రో ప్లాస్టిక్స్ ఉండటం ఆందోళనకరం.. ఇది ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయి.. దీనిపై తగు చర్యలు తీసుకోవాలని టాక్సిక్స్ లింక్ అసోసియేట్ డైరెక్టర్ సతీశ్ సిన్హా అన్నారు.