iDreamPost
android-app
ios-app

సీఎం వైఎస్‌ జగన్‌ను కలిసిన మేకపాటి విక్రమ్‌

  • Published Apr 28, 2022 | 8:25 PM Updated Updated Apr 28, 2022 | 9:01 PM
  • Published Apr 28, 2022 | 8:25 PMUpdated Apr 28, 2022 | 9:01 PM
సీఎం వైఎస్‌ జగన్‌ను కలిసిన మేకపాటి విక్రమ్‌

వైసీపీ అధ్యక్షుడు, సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని మేకపాటి విక్రమ్‌ రెడ్డి కలిశారు. తన తండ్రి, వైసీపీ సీనియర్‌ నేత, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌ రెడ్డితో కలిసి గురువారం తాడేపల్లి వచ్చిన విక్రమ్‌ రెడ్డి మర్యాదపూర్వకంగా సీఎం జగన్‌తో భేటీ అయ్యారు. మేకపాటి రాజమోహన్‌ రెడ్డి పెద్ద కుమారుడు మేకపాటి గౌతమ్‌ రెడ్డి ఇటీవల హఠాన్మరణం చెందిన విషయం తెలిసిందే. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న గౌతమ్‌ రెడ్డి మంత్రిగా సేవలందించారు.

గౌతమ్‌ రెడ్డి అకాలమరణంతో ఆత్మకూరు అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరగబోతోంది. ఆ స్థానంలో మళ్లీ మేకపాటి కుటుంబం నుంచే అభ్యర్థిని నిలబెట్టాలని సీఎం జగన్‌ భావించారు. ఈ నేపథ్యంలో మేకపాటి తనయుడు విక్రమ్‌ రెడ్డి పేరు తెరపైకి వచ్చింది. ఆరు నెలల్లో ఆత్మకూరుకు ఉప ఎన్నిక జరగబోతోంది. ఈ ఎన్నికల్లో పోటీ చేస్తామని బీజేపీ ప్రకటించింది. ఇతర ప్రతిపక్ష పార్టీలు తమ వైఖరిని ఇంకా వెల్లడించలేదు.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetstarzbetstarzbetStarzbetjojobetbetwooncasibomcasibombetcio giriş