iDreamPost
android-app
ios-app

Mehreen Pirzada : మొదటిసారి సీనియర్ హీరోకు జోడిగా

  • Published Dec 01, 2021 | 5:03 AM Updated Updated Dec 01, 2021 | 5:03 AM
Mehreen Pirzada : మొదటిసారి సీనియర్ హీరోకు జోడిగా

గత ఏడాది పెళ్లి చేసుకున్న కాజల్ అగర్వాల్ త్వరలో తల్లి కానుండటంతో తను ఆల్రెడీ ఒప్పుకున్న ప్రాజెక్టులకు చిక్కొచ్చి పడింది. కొన్ని వెయిట్ చేయక తప్పని స్థితిలో ఉండగా మరికొన్ని మార్చుకునే అవకాశం ఉండటంతో ఆ దిశగా వెళ్తున్నాయి. అందులో ఒకటి నాగార్జున ది ఘోస్ట్. ఈ సినిమాలో కాజల్ స్థానంలో మెహ్రీన్ ని సెలెక్ట్ చేసుకున్నారని లేటెస్ట్ అప్ డేట్. అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ డీల్ ఆల్మోస్ట్ సెట్ అయ్యిందని, రెమ్యునరేషన్ విషయంలో చర్చలు జరిగినా ఫైనల్ గా ఇరు వర్గాలు అంగీకారానికి వచ్చినట్టు తెలిసింది. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందుతున్న ఘోస్ట్ ఫస్ట్ లుక్ ఇంతకుముందే వచ్చింది.

ప్రస్తుతం నాగ్ బంగార్రాజు షూటింగ్ ని పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ జనవరిలో విడుదల చేయాలనే సంకల్పం పెట్టుకోవడంతో ఘోస్ట్ కు తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చారు. పైగా కాజల్ రీ ప్లేసెమెంట్ కు టైం పట్టింది. ఇక మెహ్రీన్ సంగతి చూస్తే కాబోయే పెళ్లిని రద్దు చేసుకున్నాక కెరీర్ మీద సీరియస్ గా దృష్టి పెట్టింది. హీరో ఇమేజ్ ని పట్టించుకోకుండా దర్శకుడు మారుతీ మీద అభిమానంతో చేసిన మంచి రోజులు వచ్చాయి ఫ్లాప్ కావడం ఊహించని షాకే. నిర్మాతలు లాభ పడ్డారు కానీ ప్రేక్షకులకు ఈ సినిమా ఆశించిన కిక్ ఇవ్వలేకపోయింది. ఇప్పుడు తన ఆశలన్నీ 2022 ఫిబ్రవరిలో విడుదల కాబోయే ఎఫ్3 మీదే ఉన్నాయి

ఇవి కాకుండా కన్నడలో నీ సిగోవరిగు అనే సినిమా ద్వారా శాండల్ వుడ్ ఎంట్రీ ఇవ్వబోతోంది. వీటిని మించి కొత్త కమిట్ మెంట్లు ఏవీ లేవు. నిన్నటి తరం సీనియర్ హీరోల్లో మెహ్రీన్ ఇప్పటిదాకా జోడిగా నటించలేదు.ఎఫ్2 చేసింది కానీ తను వరుణ్ తేజ్ కి హీరోయిన్ కాబట్టి లెక్కలోకి రాదు. రవితేజ, గోపీచంద్ లాంటి వాళ్ళతో నటించినప్పటికీ ఆ నలుగురుతో సమానమని చెప్పలేం. మొత్తానికి మెహ్రీన్ కెరీర్ ప్లానింగ్ తమన్నా రూటులో సాగుతున్నట్టు కనిపిస్తోంది. బెట్టు చేస్తూ కూర్చుంటే కష్టమని గుర్తించి హీరో, బ్యానర్ లాంటి వాటికి ప్రాధాన్యం ఇస్తోంది. ఈ కారణంగానే ప్రగ్య జైస్వాల్ బాలయ్య అఖండ చేసిన సంగతి తెలిసిందే

Also Read : RRR : రెండు వైపులా దిగ్బంధనంలో రాజమౌళి టీమ్

Jojobet GirişgrandpashabetcasibomjojobetcasibomcasibomJojobetjojobetgrandpashabetmatbet girişgrandpashabetDeneme Bonusu Veren Sitelergrandpashabet kayıp bonusugrandpashabet kayıp bonusugrandpashabet telegramgrandpashabet girişGrandpashabetGrandpashabetHiltonbetGrandpashabetjojobetjojobet girişcasibomgrandpashabetesrar satın algrandpashabetmarsbahis giriş