iDreamPost
android-app
ios-app

మెగాస్టార్ చిరంజీవికి సముచితమైన గౌరవం

  • Published Nov 29, 2022 | 1:53 PM Updated Updated Dec 05, 2023 | 5:39 PM

గతంలో సూపర్ స్టార్ రజనీకాంత్, బిగ్ బి అమితాబ్ బచ్చన్ లాంటి లెజెండ్స్ అందుకున్న ఈ గౌరవాన్ని ఆలస్యంగా అయినా సరే చిరుకి ఇవ్వడం మంచి పనే.

గతంలో సూపర్ స్టార్ రజనీకాంత్, బిగ్ బి అమితాబ్ బచ్చన్ లాంటి లెజెండ్స్ అందుకున్న ఈ గౌరవాన్ని ఆలస్యంగా అయినా సరే చిరుకి ఇవ్వడం మంచి పనే.

  • Published Nov 29, 2022 | 1:53 PMUpdated Dec 05, 2023 | 5:39 PM
మెగాస్టార్ చిరంజీవికి సముచితమైన గౌరవం

మెగాస్టార్ చిరంజీవి కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరింది. గోవాలో జరిగిన అంతర్జాతీయ భారత చలనచిత్రోత్సవంలో ఇండియన్ పర్సనాలిటీ అఫ్ ది ఇయర్ 2022 పురస్కారంతో కేంద్ర ప్రభుత్వం సత్కరించడం అభిమానులను ఆనందంలో ముంచెత్తుతోంది. గతంలో సూపర్ స్టార్ రజనీకాంత్, బిగ్ బి అమితాబ్ బచ్చన్ లాంటి లెజెండ్స్ అందుకున్న ఈ గౌరవాన్ని ఆలస్యంగా అయినా సరే చిరుకి ఇవ్వడం మంచి పనే. నలభై ఏళ్ళకు పైగా నట ప్రస్థానంలో నూటా యాభైకి పైగా సినిమాల్లో నటించి ఇప్పటికీ రెండు మూడు సినిమాల షూటింగులతో బిజీగా ఉన్న చిరంజీవిని అభినందిస్తూ పలువురు నటులు రాజకీయనాయకులు ట్వీట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ చివరి వరకు సినిమాల్లో నటిస్తూనే ఉంటానని అభిమానుల ఆదరణే తననీ స్థాయికి చేర్చాయని అన్నారు

ఎలా చూసుకున్నా మెగాస్టార్ కు ఈ అవార్డు దక్కే అన్ని అర్హతలు ఉన్నాయి. చిన్న ఆర్టిస్టుగా కెరీర్ మొదలుపెట్టి ఒక్కో అడుగు వేసుకుంటూ ఏ పాత్ర ఇచ్చినా నో అనకుండా, పున్నమి నాగు లాంటి నెగటివ్ క్యారెక్టర్లకు సైతం ఒప్పుకుని అద్భుతంగా మెప్పించిన చిరంజీవికి ఖైదీతో వచ్చిన బ్రేక్ స్టార్ హీరోని చేసింది. అప్పటిదాకా టాలీవుడ్ కు అంతగా పరిచయం లేని స్పీడ్ బ్రేక్ డాన్స్ ని పరిచయం చేసి కొత్త ట్రెండ్ కి శ్రీకారం చుట్టాడు. కమర్షియల్ సినిమా వేగాన్ని పెంచినవాళ్లతో ఎన్టీఆర్ తర్వాత ఆ స్థాయి గుర్తింపు వచ్చింది చిరుకే. వాటికే కట్టుబడకుండా రుద్రవీణ, స్వయంకృషి లాంటి ఎన్నో సందేశాత్మకమైన సినిమాల్లోనూ భాగమయ్యారు

కెరీర్లో ఎన్నో ఒడిదుడుకులు వచ్చినప్పటికీ వాటిని తట్టుకుని నెంబర్ వన్ సింహాసనాన్ని దశాబ్దాలకు పైగా అనుభవించిన చిరంజీవి ఏడు పదుల వయసుకు దగ్గరగా ఉన్నా ఇప్పటికీ అదే ఎనర్జీతో ఫ్యాన్స్ ని మెప్పించేందుకు కష్టపడటం చూస్తే ఇంత స్థాయికి రావడానికి కారణం ఏంటో అర్థమవుతుంది. అందుకే పర్సనాలిటీ అఫ్ ది ఇయర్ బిరుదు ఆయనకు నూటికి నూరు పాళ్ళు సరైనదే. ప్రస్తుతం వాల్తేర్ వీరయ్య షూటింగ్ పూర్తి చేసే పనిలో ఉన్న చిరు అది కాగానే మెహర్ రమేష్ భోళా శంకర్ తో జాయినవుతారు. ఆ తర్వాత ఎవరితో ఉంటుందనేది ఇంకా క్లారిటీ లేదు. వెంకీ కుడుములతో గతంలో అనౌన్స్ చేసిన ప్రాజెక్టు ఉంటుందో లేదో తెలియాల్సి ఉంది

Jojobet GirişjojobetsezarcasinoJojobetJojobetjojobetJojobetjojobetJojobetcasibomfixbetfixbetsüpertotobetsüpertotobetcasibomcasibomcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet giriş