iDreamPost
android-app
ios-app

మెగా వర్సెస్ నందమూరి.. ‘అన్ స్టాపబుల్’ గొడవ!

  • Published Dec 28, 2022 | 10:28 AM Updated Updated Dec 06, 2023 | 11:01 AM

అభిమానులు మాత్రం ఒకరినొకలు శత్రువుల్లాగా చూస్తారు. వ్యక్తిగత విమర్శలు, గొడవలకు కూడా దిగుతారు.

అభిమానులు మాత్రం ఒకరినొకలు శత్రువుల్లాగా చూస్తారు. వ్యక్తిగత విమర్శలు, గొడవలకు కూడా దిగుతారు.

  • Published Dec 28, 2022 | 10:28 AMUpdated Dec 06, 2023 | 11:01 AM
మెగా వర్సెస్ నందమూరి.. ‘అన్ స్టాపబుల్’ గొడవ!

టాలీవుడ్ లో మెగా, నందమూరి కుటుంబాల మధ్య బాక్సాఫీస్ పోరు ఎప్పుడూ రసవత్తరంగానే ఉంటుంది. హీరోలు తామంతా ఒకటేనని సంకేతాలు ఇచ్చినా.. అభిమానులు మాత్రం ఒకరినొకలు శత్రువుల్లాగా చూస్తారు. వ్యక్తిగత విమర్శలు, గొడవలకు కూడా దిగుతారు. అంతెందుకు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో నటించారు. ప్రపంచవ్యాప్తంగా ఆ సినిమాకు ప్రశంసలు దక్కితే.. ఎన్టీఆర్, చరణ్ అభిమానులు మాత్రం “మా హీరో మెయిన్. మీ హీరో సైడ్ యాక్టర్” అంటూ సోషల్ మీడియా సాక్షిగా వ్యక్తిగత దూషణలకు దిగారు. తాజాగా మరోసారి అలాంటి పరిస్థితే ఏర్పడింది.

బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ ఇద్దరూ సినిమాలు, రాజకీయాల్లో ఉన్నారు. గతంలో ఇద్దరు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్న సందర్భాలున్నాయి. అయితే తాజాగా ఇద్దరు ‘అన్ స్టాపబుల్’ వేదికగా కలుసుకున్నారు. బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న ఈ షోలో పవన్ పాల్గొన్నాడు. తన షోలో గెస్ట్ గా పాల్గొనడానికి వచ్చిన పవన్ ని రిసీవ్ చేసుకోవడానికి.. బాలకృష్ణ స్వయంగా కారు దగ్గరకు వెళ్లి మరీ స్వాగతం పలకటం అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే కొందరు పవన్ అభిమానులు ఈ వీడియో క్లిప్ ని సోషల్ మీడియాలో షేర్ చేసి బాలకృష్ణను ట్రోల్ చేయడం ప్రారంభించారు. “పేరు తెలీదు అన్నోడినే పడిగాపులు కాసేలా చేశాడు.. ఇది ఉస్తాద్ పవన్ రేంజ్” అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెట్టారు. దీంతో మెగా వర్సెస్ నందమూరి వార్ మొదలైంది.

పవన్ ఫ్యాన్స్ కామెంట్స్ తో బాలకృష్ణ ఫ్యాన్స్ రెచ్చిపోతున్నారు. “మా బాలయ్య పిలవగానే మీవాడు పరుగెత్తుకుంటూ వచ్చాడు. అది మా రేంజ్. ఏదో సంస్కారం కొద్దీ బాలయ్య వెల్కమ్ చెప్పాడు అంతే”, “హిందూపురం ఎమ్మెల్యేని కలిసిన డిపాజిట్ లెస్ కళ్యాణ్”, “మావాడు రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు.. మీ వాడు కనీసం వార్డ్ మెంబెర్ గా కూడా గెలవలేడు” అంటూ ఇంకా మాటల్లో చెప్పలేని వ్యాఖ్యలతో విరుచుకుపడుతున్నారు. పవన్ ఫ్యాన్స్ కూడా అంతే ధీటుగా రెచ్చిపోతున్నారు. దీంతో అన్ స్టాపబుల్ షో కాస్తా సోషల్ మీడియాలో బాలకృష్ణ ఫ్యాన్స్ వర్సెస్ పవన్ ఫ్యాన్స్ వార్ గా మారిపోయింది.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss