iDreamPost
iDreamPost
సుప్రీమ్ హీరో సాయి తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ ని హీరోగా పరిచయం చేస్తూ తీసిన ఉప్పెన ఎప్పుడో పూర్తయి ఏప్రిల్ లోనే విడుదలకు సిద్ధమైనా లాక్ డౌన్ వల్ల వాయిదా పడుతూ వచ్చి ఇప్పటికీ థియేటర్ల కోసం ఎదురు చూస్తూనే ఉంది. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబుని దర్శకుడిగా పరిచయం చేస్తూ మైత్రి సంస్థ నిర్మించిన ఈ మూవీకు అయిన బడ్జెట్ కూడా ఎక్కువే. సముద్రం బ్యాక్ డ్రాప్ లో రా లవ్ స్టోరీగా రూపొందిన ఉప్పెన ద్వారా పరిచయమైన కృతి శెట్టికి అప్పుడే ఆఫర్లు కూడా వస్తున్నాయి.
ఇప్పటిదాకా రిలీజ్ చేసిన రెండు ఆడియో సింగల్ ట్రాక్స్ కు భారీ రెస్పాన్స్ వచ్చి బ్లాక్ బస్టర్ ట్రాక్స్ గా నిలిచాయి. ప్రేక్షకుల్లో కూడా దీని మీద సాఫ్ట్ కార్నర్ వచ్చింది.
ఓటిటి ఆఫర్ల ఎన్ని వచ్చినా నిర్మాతలు ఓపిగ్గా ఎదురు చూశారు. దీని సంగతలా ఉంచితే క్రిష్ దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ రెండో సినిమా కూడా షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీని ప్రసిద్ధ నవల కొండపొలం ఆధారంగా నిర్మించినట్టు సమాచారం. ఇది మాత్రం డిజిటల్ కోసమే అనే టాక్ వచ్చింది కానీ అధికారికంగా ఎలాంటి అప్డేట్ లేదు. ఒకవేళ డిజిటల్ కే మొగ్గు చూపిస్తే ఎప్పుడు చేయొచ్చనే క్లారిటీ ప్రస్తుతానికి లేదు. ఇంకా టైటిల్ కూడా డిసైడ్ చేయలేదు. ఉప్పెన తర్వాతే విడుదల చేయాలన్నది మెగా కాంపౌండ్ ఆలోచన.
తెరకు పరిచయం కాకుండానే ఇలా రెండు సినిమాలు రిలీజ్ కు రెడీ కావడం బహుశా చాలా అరుదుగా జరుగుతుంది. ఉప్పెన మీదున్న గట్టి నమ్మకం ఎంత ఆలస్యమైనా వేచి చూసేలా చేస్తోంది. గతంలో సాయి తేజ్ కూడా మొదటి సినిమా రేయ్ ని ఫినిష్ చేస్తే అనివార్య కారణాల వల్ల రెండో చిత్రం పిల్లా నువ్వు లేని జీవితం ఫస్ట్ మూవీగా వచ్చి హిట్టు కొట్టింది. ఆ తర్వాత రేయ్ అలా వచ్చి ఇలా వెళ్ళింది. వైష్ణవ్ ది అచ్చం అలాంటి పరిస్థితే కాకపోయినా ఇంచుమించు ఇబ్బంది మాత్రం ఒకటే అనిపిస్తుంది. ఈ గండాన్ని దాటుకుని బయటికి రావడానికి కొంత టైం పట్టేలా ఉంది. వీటి సంగతెలా ఉన్నా వైష్ణవ్ తేజ్ మరో రెండు ప్రాజెక్టులు ఆల్మోస్ట్ ఓకే అయ్యే స్టేజిలో ఉన్నాయి