iDreamPost
android-app
ios-app

మాస్ రాజా మరో తమన్ ని తయారు చేస్తున్నాడా?

  • Published Jan 03, 2023 | 9:32 PM Updated Updated Dec 09, 2023 | 12:09 PM

ఆయనకు కష్టం విలువ, అవకాశం విలువ తెలుసు కాబట్టే.. కష్టపడే స్వభావమున్న కొత్త వారికి అవకాశాలు ఇస్తుంటాడు. ఆయన పరిచయం చేసిన ఎందరో దర్శకులు స్టార్ డైరెక్టర్స్ గా ఎదిగారు.

ఆయనకు కష్టం విలువ, అవకాశం విలువ తెలుసు కాబట్టే.. కష్టపడే స్వభావమున్న కొత్త వారికి అవకాశాలు ఇస్తుంటాడు. ఆయన పరిచయం చేసిన ఎందరో దర్శకులు స్టార్ డైరెక్టర్స్ గా ఎదిగారు.

  • Published Jan 03, 2023 | 9:32 PMUpdated Dec 09, 2023 | 12:09 PM
మాస్ రాజా మరో తమన్ ని తయారు చేస్తున్నాడా?

ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినీ పరిశ్రమలో అడుగుపెట్టి ఒక్కో మెట్టు ఎదుగుతూ స్టార్ గా ఎదిగాడు మాస్ మహారాజా రవితేజ. ఆయనకు కష్టం విలువ, అవకాశం విలువ తెలుసు కాబట్టే.. కష్టపడే స్వభావమున్న కొత్త వారికి అవకాశాలు ఇస్తుంటాడు. ఆయన పరిచయం చేసిన ఎందరో దర్శకులు స్టార్ డైరెక్టర్స్ గా ఎదిగారు. అలాగే ఆయన సపోర్ట్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్ తమన్ టాప్ పొజిషన్ కి చేరుకున్నాడు. ఇప్పుడు మరో మ్యూజిక్ డైరెక్టర్ ని అదే స్థాయిలో ఎంకరేజ్ చేస్తున్నాడు.

ప్రస్తుతం తమన్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా కొనసాగుతున్నాడు. అల వైకుంఠపురములో చిత్రానికి ఏకంగా జాతీయ అవార్డు అందుకున్న తమన్ చేతిలో ప్రస్తుతం పలు భారీ ప్రాజెక్ట్ లు ఉన్నాయి. అయితే తమన్ కెరీర్ స్టార్టింగ్ లో రవితేజ ఎంతో ఎంకరేజ్ చేశాడు. తమన్ సంగీతం అందించిన మొదటి పెద్ద సినిమా రవితేజ నటించిన ‘కిక్’. ఆ సినిమా మ్యూజికల్ గా పెద్ద హిట్ అయ్యి తమన్ కి మంచి పేరు తీసుకొచ్చింది. ఆ తర్వాత తమన్ కి అవకాశాలు పెరిగాయి. రవితేజ కూడా వరుస అవకాశాలు ఇస్తూ వచ్చాడు. ఆ ఇద్దరి కలయికలో ఇప్పటిదాకా ఏకంగా పది సినిమాలు వచ్చాయంటే.. తమన్ ని రవితేజ ఎంతలా ఎంకరేజ్ చేశాడో అర్థం చేసుకోవచ్చు. అలా తమన్ ఎదుగుదలలో రవితేజ పాత్ర కూడా ఉంది. ఇక ఇప్పుడు మరో సంగీత దర్శకుడు భీమ్స్‌ సిసిరోలియో ని కూడా అదే స్థాయిలో ఎంకరేజ్ చేస్తున్నాడు.

చేసింది తక్కువ సినిమాలే అయినా కొన్ని బ్లాక్ బస్టర్ సాంగ్స్ అందించాడు భీమ్స్‌ సిసిరోలియో. కానీ ఎందుకనో పెద్ద సినిమాలకు పనిచేసే అవకాశం రాలేదు. ఆయన సంగీతం అందించిన మొదటి పెద్ద సినిమా రవితేజ నటించిన ‘బెంగాల్ టైగర్’ చిత్రమే. ఆ మూవీ మ్యూజికల్ గా హిట్ అయినప్పటికీ ఆ తర్వాత కూడా భీమ్స్ కి పెద్ద సినిమాల అవకాశాలు రాలేదు. ఈ క్రమంలో ‘ధమాకా’ తో మరో మంచి అవకాశాన్ని ఇచ్చాడు రవితేజ. తనపై రవితేజ పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేస్తూ భీమ్స్ అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చి ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించాడు. ప్రస్తుతం ఎక్కడ చూసినా ధమాకా పాటల సందడే కనిపిస్తోంది. పలువురు కమర్షియల్ ఫిల్మ్ మేకర్స్ భీమ్స్ వైపు చూస్తున్నారు. త్వరలో భీమ్స్ కూడా తమన్ లా వరుస సినిమాలతో ఓ వెలుగు వెలిగినా ఆశ్చర్యం లేదు. మరోవైపు రవితేజ కూడా భీమ్స్ ని బాగా సపోర్ట్ చేస్తున్నాడు. తన తదుపరి చిత్రం ‘రావణాసుర’కి కూడా అవకాశం ఇచ్చాడు. రవితేజ ప్రోత్సాహంతో భీమ్స్ మరో తమన్ అవుతాడేమో చూడాలి.

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş