గద్దర్ మృతిపై లేఖ విడుదల చేసిన మావోయిస్ట్ పార్టీ

ప్రజా ఉద్యమ నేత, విప్లవ గాయకుడు గద్దర్ (గుమ్మడి విఠల్ రావు) అనారోగ్యంతో ఆదివారం సాయంత్రం ఓ ఆస్పత్రిలో మరణించిన విషయం తెలిసిందే. ఆయన మరణంతో తెలంగాణ ప్రజానీకంతో పాటు యావత్ తెలుగు ప్రజలు కన్నీటి సంద్రంలో మునిగిపోయారు. ప్రజా ఉద్యమంలో ఎన్నో ఏళ్లు తన గొంతును వినిపించిన ఆయన.. తెలంగాణ సాధనలో ప్రధాన పాత్ర పోషించారు. అయితే మరణానంతరం ఆయన భౌతికకాయాన్ని  ప్రజల సందర్భనార్థం సోమవారం ఎల్బీ స్టేడియంలో ఉంచి సోమవారం మధ్యాహ్నం అంతిమయాత్రను కొనసాగించారు. అయితే ఈ క్రమంలోనే గద్దర్ మృతిపై మావోయిస్ట్ పార్టీ స్పందించి ఓ లేఖను విడుదల చేసింది.

ఆ లేఖలో ప్రధానంగా ఏముందంటే?.. విప్లవ గాయకుడు గద్దర్ మృతి తీవ్రంగా కలిచి వేసింది. ఆయన 4 ఏళ్లు అజ్ఞాత జీవితాన్ని గడిపారు. మేము గద్దర్ అవసరాన్ని గుర్తించి అతడిని బయటకు పంపించాము. గద్దర్ చేత జన నాట్య మండలి ఏర్పాటు చేసి చైతన్య పరిచాము. ఇదే కాకుండా ఆయన గతంలో ఇతర పార్టీల్లో చేరినప్పుడు ఆయనకు షోకాజ్ నోటీసులు కూడా పంపాం. ఇక 2012లో పార్లమెంట్ మార్గాన్ని ఎంచుకుని ఆయన రాజీనామా చేశారు అంటూ మావోయిస్ట్ పార్టీ లేఖలో పేర్కొంది.

ఇది కూడా చదవండి: ఆఖరి కోరిక తీరకుండానే మరణించిన గద్దర్‌!

Show comments