iDreamPost
android-app
ios-app

Baby Girl: ఆడపిల్ల పుట్టిందని తండ్రి అమ్మకానికి పెట్టాడు.. ఎక్కడో కాదు..!

Baby Girl: ఆడపిల్ల పుట్టిందని తండ్రి అమ్మకానికి పెట్టాడు.. ఎక్కడో కాదు..!

ఈ మధ్యకాలంలో కొడుకునే కనాలి, కొడుకో కావాలి అనే ధోరణి పోయింది. పుట్టింది ఆడపిల్లైనా, మగబిడ్డ అయినా ఎంతో ప్రేమగా చూసుకుంటున్నారు. ఇద్దరి మధ్య తేడా లేకుండానే పెంచుతున్నారు. కానీ, ఇప్పటికీ ఆడపిల్ల పుట్టిందని ముఖం మాడ్చుకునే వాళ్లు లేకపోలేదు. ఈ తండ్రి అయితే అక్కడితో ఆగకుండా ఆడపిల్ల పుట్టందని ఏకంగా అమ్మకానికి పెట్టాడు. ఎవరికీ తెలియకుండా కన్న బిడ్డను వేరే వాళ్లకు అమ్మేశాడు. తల్లి ఎక్కడ పోలీసులను ఆశ్రయిస్తుందో అని ఆమెను గదిలో బందించాడు.

ఈ అమానుష ఘటన జగిత్యాల జిల్లాలో వెలుగు చూసింది. ఎండపల్లి మండలం గుల్లకోట గ్రామంలో జ్యోత- లక్ష్మణ్ అనే దంపతులు నివసిస్తున్నారు. వారికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. ఇటీవల మూడో కాన్పులో కూడా ఆడపిల్లే పుట్టింది. ఇప్పుడైనా అబ్బాయి పుడతాడని ఎదురు చూసిన లక్ష్మణ్ ఆశలు అడియాసలు అయ్యాయి. డబ్బు మీద అతనికి ఉన్న పేరాశతో ఈ బిడ్డతోనే డబ్బు సంపాదించాలని భావించాడు. ఆమెను గుట్టుచప్పుడు కాకుండా బేరం పెట్టాడు.

అతని చర్యలకు తల్లి కూడా తోడ్పాటు అందించింది. అనుకున్నదే తడవుగా వేరే వాళ్లకు అమ్మేశాడు. ఎప్పటిలాగానే జ్యోతి పెద్ద పిల్లలకు స్నానం చేయిస్తోంది. అయితే ఎవరో వచ్చి కారులో మూడో బిడ్డను తీసుకెళ్లారు. అది గమనించిన పెద్దమ్మాయి.. తల్లికి చెప్పింది. జ్యోతి కారుని వెంబడించే ప్రయత్న చేసింది. కానీ, ఫలితం లేకుండా పోయింది. అప్పటికే లక్ష్మణ్ డబ్బు తీసుకుని ఇంట్లో పెట్టుకున్నాడు. భార్యకు విషయం చెప్పి.. ఎవరికీ చెప్పకంటూ గదిలో బందించాడు.

అయితే ఈ విషయం ఆ నోటా ఈ నోటా పాకి జ్యోతి తల్లిదండ్రులకు తెలిసింది. వారు ఇంటికి వచ్చి జ్యోతిని పోలీసు స్టేషన్ కు తీసుకెళ్లారు. ఇలా కన్న తండ్రే బిడ్డను అమ్మేశాడంటూ చెప్పడంతో పోలీసులు తక్షణమే స్పందించి అదేరోజు కొన్న వ్యక్తి నుంచి చిన్నారిని తీసుకొచ్చి తల్లికి అప్పగించారు. అయితే ఈ విషయంపై కేసు నమోదు కాలేదని తెలుస్తోంది. మొత్తం కుటుంబాన్ని పోలీస్ స్టేషన్ కు పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చినట్లు సమాచారం.

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş