ప్రపంచంలో చాలా దేశాలు ఉగ్రదాడులకు బాధితులే. అలానే మన దేశంలో కూడా తరచూ ఉగ్ర కదలికలు కనిపిస్తూనే ఉంటాయి. టెర్రరిస్టులు అనేక దాడులకు పాల్పడి ఎందరినో బలి తీసుకున్నారు. ముఖ్యంగా పబ్లిక్ ప్రదేశల్లో తుపాకులతో వచ్చి.. విచక్షణ రహితంగా సామాన్యులపై కాల్పులు జరిపిన సంఘటనలు అనేకం ఉన్నాయి. ఇక సంఘ విద్రోగ శక్తులు ఎదురైనప్పుడు ఎలాంటి ప్రతిచర్యలకు దిగాలనేది తరచూ అధికారులు డ్రిల్ చేస్తుంటారు. తాజాగా ప్రాణాలకు లెక్కచేయకుండా ఓ సామాన్యుడు టెర్రరిస్టులకు ఎదురెళ్లాడు. ఈ ఘటన సోషల్ మీడియాలో తెగ వైరల్ మారింది. ఇక ఆ సామాన్యుడి తెగువను చూసి నెటిజన్లు మెచ్చుకున్నారు. చివరకు అసలు విషయం తెలుసుకుని నోరెళ్ల బెట్టారు. అసలు ఏం జరిగిందంటే..
మహారాష్ట్రలోని ధూలే ప్రాంతంలో శ్రీ స్వామినారాయణ అనే దేవాలయం ఉంది. ఆ ఆలయం భక్తులతో రద్దీగా ఉన్న సమయంలో కొందరు దుండగలు దూసుకొచ్చారు. వారంతా ముఖానికి మాస్కులు ధరించి చేతిలో ఆయుధాలు ధరించి ఉన్నారు. అలాగే గుడిలో ఓ భక్తుడి తలపై తుపాకి పెట్టి.. బెదిరింపులకు దిగారు. ఈ ఆకస్మిక చర్యతో ఆలయంలోని భక్తులు భయాందోళనకు గురయ్యారు. కొందరు పిల్లలు అయితే పెద్ద ఎత్తున ఏడుపులు, కేకలు పెట్టారు. ఈ పరిస్థితిలో తన ప్రాణం పోతే పోయిందని ఓ వ్యక్తి ధైర్యంగా ఉగ్రవాదుల ముందుకు వెళ్లాడు. వారు అతడిపై గన్ చూపించి బెదిరిస్తోన్న దుండగుడిపైకి దూసుకెళ్లాడు. మీకసలు బుద్ధుందా? మీ మనుషులేనా? అంటూ వారి మీద కేకలు వేయడమే కాకుండా.. ఆ దుండగుడి చెంప పగలకొట్టాడు.
మరోవైపు కొందరు స్థానికులు .. ధూలే ప్రాంతంలోని శ్రీ స్వామి నారాయణ ఆలయంలోకి ఉగ్రవాదులు ప్రవేశించారని పోలీస్ కంట్రోల్ రూమ్ కి సమాచారం వచ్చింది. వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని, పరిస్థితి తమ కంట్రోల్ లోకి తీసుకొచ్చారు. దుండగులకు ఎందరు వెళ్లిన వ్యక్తిని ప్రశంసించారు. చివరకు అసలు విషయం తెలుసుకుని స్థానికులు అవాకయ్యారు. ఇందతా పోలీసులు నిర్వహించిన మాక్ డ్రిల్ లో భాగమని తెలియడంతో ఊపిరి పీల్చుకున్నారు. టెర్రరిస్టుపైకి దూసుకెళ్లిన వ్యక్తి పేరు ప్రశాంత్ కులకర్ణి అని పోలీసులు వెల్లడించారు. అతడి తెగువకు పోలీసులు ప్రశంసించారు. మరి.. ఈ మాక్ డ్రిల్ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.