iDreamPost
android-app
ios-app

దేవుడితో మాట్లాడి చెప్పండి..ప్రభుత్వానికి విచిత్రమైన RTI దరఖాస్తు!

దేవుడితో మాట్లాడి చెప్పండి..ప్రభుత్వానికి విచిత్రమైన RTI దరఖాస్తు!

సమాచార హక్కు చట్టం అనేది ఒకటి ఉందనే విషయం చాలా మందికి తెలియదు. అతి తక్కువ మందికి మాత్రమే ఈ చట్టం ఉందనే విషయం తెలుసు. ఈ ఆర్టీఐ యాక్ట్ ద్వారా ప్రభుత్వం నుంచి మనకు కావాల్సిన సమాచారాన్ని తెలుసుకోవచ్చు. కేవలం దేశ, రాష్ట్ర భద్రతలకు సంబంధించిన విషయాల్లో కాకుండా..మిగిలిన వాటికి సంబంధించిన అంశాల్లో వివిధ సమాచారం తెలుసుకునేందుకు ఈ చట్టాన్ని ఉపయోగించుకుంటారు. తాజాగా ఓ వ్యక్తి ఆర్టీఐకి దరఖాస్తు చేసుకున్న లేఖ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అందులో  దేవుడితో మాట్లాడి.. వానాకాలంలో ఎండలు ఎప్పుడు వస్తాయో చెప్పండంటూ కేంద్ర ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నాడు. ప్రస్తుతం ఈ  లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

బిహార్ రాష్ట్రం గౌరబౌరమ్ జిల్లా మహౌర్ కు చెందిన రాజ్ కుమార్  అనే వ్యక్తి  తన కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. ఈయన ఆర్టీఐ కార్యకర్తగా కూడా ఉంటున్నారు. పలు అంశాలకు సంబంధించి తరచూ స్పందిస్తుంటారు. వర్షాకాలం మొదలై వారాలు గడుస్తున్నా బిహార్ రాష్ట్రంలో మాత్రం సరిగ్గా వర్షాలు కురవడం లేదు. దీనికి తోడు ఉక్కపోత భయకరంగా పెడుతోంది. దీంతో విసిగిపోయిన రాజ్ కుమార్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అసలు వర్షాలు  కురవకపోవడానికి కారణమేంటో వివరించాలని భూ విజ్ఞాన శాఖను ఆర్టీఐ యాక్ట్ ద్వారా కోరారు. అంతేకాక ప్రతి వాదిగా చేర్చడం గమనార్హం. దేవుడిని అడిగి తెలుసుకోవాలన్నారు. దీని కోసం ఇటీవల ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-3 ఏమైనా ఉపయోగ పడుతుందేమో పరిశీలిచాలని కోరారు.

ఇటీవలే చంద్రుడి దక్షిణ ధ్రువం సమీపంలో చక్కర్లు కొట్టిన ప్రజ్ఞాన్ రోవర్ కు అమర్చిన  అధునాతన పరికరాల వల్లే ప్రకృతి స్తంభించిపోయే ఉంటుందని రాజ్ కుమార్ అనుమానం వ్యక్తం చేశారు. దేవుడి నుంచి సలహా తీసుకునే అవకాశం ఎలా ఉంటుందని విలేరులు ప్రశ్నించగా.. చంద్రయాన్-3లో ప్రజ్ఞాన్ రోవర్ ..దేవుడి నుంచి సంకేతాలను సేకరించి..విక్రమ్ ల్యాండర్ సాయంతో భూమికి చేరుస్తుందని, వాటిని పరిశోధించి వాతావరణ మార్పులకు గల కారణాలను తెలుసుకోవచ్చని రాజ్ కుమార్ చెప్పాడు. వాతావరణంలో వచ్చిన మార్పులకు గల కారణాలను దేవుడిని అడిగి తెలుసుకొని చెప్పమనడమే విచిత్రమైతే.. అంతకు మించి ప్రజ్ఞాన్ రోవర్ సాయంతో దేవుడి నుంచి సంకేతాలను భూమికి తీసుకురమ్మని చెప్పడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఆర్టీఐ దరఖాస్తు వైరల్ అవుతోంది. మరి.. ఈ విచిత్ర లేఖపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి