iDreamPost
android-app
ios-app

ఒకటి – రెండు కాదు.. ఏకంగా 15 బీర్లు తాగి రోడ్లపై షికారు.. ఆ తర్వాత ఇలా..

  • Published Jun 12, 2022 | 8:38 AM Updated Updated Jun 12, 2022 | 8:38 AM
  • Published Jun 12, 2022 | 8:38 AMUpdated Jun 12, 2022 | 8:38 AM
ఒకటి – రెండు కాదు.. ఏకంగా 15 బీర్లు తాగి రోడ్లపై షికారు.. ఆ తర్వాత ఇలా..

ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 15 బీర్లు తాగి.. బైక్ పై షికారుకు బయల్దేరాడు. కొద్దిసేపు హడావిడి చేశాడు. ఆ తర్వాత పోలీసులకు చిక్కాడు. అతనికి బ్రీత్ అనలైజర్ పరీక్ష నిర్వహించిన పోలీసులు.. అందులో వచ్చిన రీడింగ్ చూసి షాకయ్యారు. ఈ ఘటన ఉమ్మడి కృష్ణాజిల్లా పెనమలూరు సమీపంలో జరిగింది. వెంట్రప్రగడకు చెందిన ఓ వ్యక్తి శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో పీకలవరకూ మద్యం సేవించి.. బైక్ పై షికారుకు బయల్దేరాడు. బందరు రోడ్డుపై కొద్దిసేపు హడావిడి చేశాడు. ఆ తర్వాత పోలీసులకు చిక్కాడు.

పూర్తిగా మద్యం మత్తులో ఉన్న ఆ వ్యక్తికి.. ఆ సమయంలో డ్యూటీలో ఉన్న పోలీసులు బ్రీత్ అనలైజర్ పరీక్ష చేశారు. బ్రీత్ అనలైజర్ లో వచ్చిన రీడింగ్ పర్సంటేజీని చూసి షాకయ్యారు పోలీసులు. ఏకంగా 530 పాయింట్లు చూపించింది. 15 బీర్లకు పైగా తాగితేనే ఇంత రీడింగ్ వస్తుందని పోలీసులు పేర్కొన్నారు. వెంటనే అతని బైక్ ను సీజ్ చేసి, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. సమయానికి అతను తమ కంట పడ్డాడని, లేదంటే ఊహించని విషాద ఘటన జరిగి ఉండేదన్నారు పోలీసులు.

 

Jojobet GirişjojobetJojobetHoliganbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcioJojobetJojobetJojobetjojobetgrandpashabet