iDreamPost
android-app
ios-app

90ML కోసం బెల్ట్‌షాప్‌పై పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు!

90ML కోసం బెల్ట్‌షాప్‌పై పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు!

ఎంతో మంది మద్యానికి బానిసలుగా మారుతున్నారు. కొందరికి మందు చుక్క పడనిదే రోజు తెల్లారదు.  ఇలా మద్యం తాగి ఎందరో తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.  అలానే మద్యం మత్తులో నేరాలకు పాల్పడి..చివరకు జైలు పాలవుతున్నారు. అయితే ఎవరైన మద్యం కావాలని పోలీస్ స్టేషన్ కి వెళ్తారా?. కానీ ఓ వ్యక్తి.. తనకు మందు ఇవ్వలేదని ఏకంగా పోలీస్ స్టేషన్ కి వెళ్లాడు. మరి..పోలీసుల రియాక్షన్ ఎలా ఉంది..   స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..

జగిత్యాల  జిల్లా హబ్సీపూర్‌ గ్రామానికి చెందిన  చిరంజీవి.. కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. అదే గ్రామంలో రవి అనే వ్యక్తి బెల్డ్ షాపు నిర్వహిస్తున్నాడు. చిరంజీవికి మద్యం తాగే అలవాటు ఉంది. తరచూ రవి వాళ్ల బెల్ట్ షాపుకు వెళ్లి.. మద్యం కొనుగోలు చేసేవాడు. అలానే  మంగళవారం కూడా  ఆ బెల్డ్ షాపు వద్దకు వెళ్లాడు. తనకు 90 ఎమ్ఎల్ మద్యం పోయాని షాపులో పని చేసే వారిని కోరాడు. అయితే అంత తక్కువ పోసేందుకు నిర్వాహకుడు నిరాకరించాడు. దీంతో వారి మద్య స్వల్ప ఘర్షణ జరిగినట్లు సమాచారం.

దీంతో తీవ్ర మనస్తాపం చెందిన చిరంజీవి కోపం పెంచుకున్నాడు. మద్యం విషయంలో ఏకంగా పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాడు. తనను కులం పేరుతో తిట్టడమే కాక తనకు మద్యం పోయకుండా అవమానించాడని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చిరంజీవి ఫిర్యాదుపై పోలీసులు విచారణ చేస్తున్నారు. మద్యం మత్తులో జరిగిన గొడవలకే పోలీస్ స్టేషన్ వెళ్తారనుకుంటే.. మద్యం కోసం కూడా వెళ్తారా? అని ఈ వార్త తెలిసిన వారు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.