iDreamPost
android-app
ios-app

91 ఏళ్ల బామ్మను పెళ్లి చేసుకున్న 23 ఏళ్ల వ్యక్తి.. ఇప్పుడు కోర్టుకు..!

పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయించబడి ఉంటాయట. అదే నిజమైతే.. ఇలాంటి పెళ్లిళ్లను చూస్తే నిజమేనా అనిపిస్తూ ఉంటుంది. తండ్రి వయస్సున్న వ్యక్తులను పెళ్లి చేసుకుంటుంటేనే జీర్ణించుకోలేకపోతుందీ ఈ సమాజం.. అలాంటిది బామ్మను మనవడు చేసుకోవడం అంటే..

పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయించబడి ఉంటాయట. అదే నిజమైతే.. ఇలాంటి పెళ్లిళ్లను చూస్తే నిజమేనా అనిపిస్తూ ఉంటుంది. తండ్రి వయస్సున్న వ్యక్తులను పెళ్లి చేసుకుంటుంటేనే జీర్ణించుకోలేకపోతుందీ ఈ సమాజం.. అలాంటిది బామ్మను మనవడు చేసుకోవడం అంటే..

91 ఏళ్ల బామ్మను పెళ్లి చేసుకున్న 23 ఏళ్ల వ్యక్తి.. ఇప్పుడు కోర్టుకు..!

ఒకప్పుడు పెళ్లంటే.. అటు ఏడు తరాలు, ఇటు ఏడు తరాలు చూసి చేసుకునే వారు. అంతేనా.. అబ్బాయి కన్నా అమ్మాయి వయస్సు కనీసం 4-10 సంవత్సరాలు వ్యత్యాసం ఉండాలి. అమ్మాయికి వంట వార్పు, సంగీతం, ఇల్లు చక్కదిద్దుకోవడం వంటి అన్ని పనులు వచ్చి ఉండాలి. ఇవన్నీ చూసినా .. చివరికి జాతకాలు చూసి.. ఇద్దరికీ మ్యాచ్ అయ్యిందంటేనే డుం డూం డుం.. పీ..పీ..పీ. లేదంటే.. సంబంధం క్యాన్సిల్. ఇవన్నీ పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లలో తప్పని సరి. కానీ ప్రేమ పెళ్లిళ్లకు ఇవేమి వర్తించవు. తనకు నచ్చిన అమ్మాయి మెడలో మూడు ముళ్లు వేయడమే వారిని తెలిసిన లెక్క పత్రాలు. అమ్మాయి పెద్దదా, చిన్నదా అని వ్యత్యాసం ఉండదు. ఇద్దరం ఇష్టపడ్డాం, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం అంతే.. వీరి దగ్గర దొరికే సమాధానం.

అయితే ఇలాంటి ప్రేమ పెళ్లిళ్లలో.. కొన్ని పెళ్లిళ్లు చూస్తుంటే నిజంగా ఆశ్చర్యమేస్తుంది. తన తండ్రి వయస్సున వ్యక్తిని ప్రేమలో పడటం, కుమార్తె వయస్సున్న అమ్మాయితో రొమాన్స్ చేయడం ఇటీవల ఎక్కువగా జరుగుతున్నాయి. కానీ అమ్మమ్మ, నాన్నమ్మ వయస్సున వ్యక్తులను ఓ యువకుడు పెళ్లాడటం గురించి విన్నారా. ఇదిగో ఈ ఫోటోలో కనిపిస్తున్నారే.. వీరిద్దరూ వాళ్లే.. బామ్మ, మనవడు కాదూ వీరూ.. భార్య భర్తలు. అవును వీరు వింటున్నది నిజమే. 91 ఏళ్ల బామ్మను 23 ఏళ్ల వ్యక్తి పెళ్లి చేసుకున్న ఘటన అర్జెంటీనాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సాల్లాకు చెందిన మారిసియో అనే యువకుడు తల్లిదండ్రులు విడిపోవడంతో తన తల్లి, సోదరి,అమ్మమ్మలతో కలిసి జీవించాడు.

అయితే అమ్మమ్మకు పెన్షన్ వస్తూ ఉండేది. 2015లో తన కన్నా 68 ఏళ్లు పెద్దదైన తన బామ్మ యోలాండా టోరెస్‌ను వివాహం చేసుకున్నాడు. వివాహం తర్వాత వీరిద్దరూ హనీమూన్ కూడా వెళ్లారట. 2016లో ఆమె మరణించింది. భర్తగా ఆమెకు వచ్చే పెన్షన్‌కు తాను అర్హుడునని పేర్కొంటూ కోర్టుకు వెళ్లాడు మారిసియో. మారిసియో వాదనపై పోలీసులు ఇరుగు పొరుగును ప్రశ్నించగా.. వారి పెళ్లి గురించి తమకేమీ తెలియదని చెప్పారు. వాదోపవాదనలు విన్న కోర్టు.. ఈ వివాహం ఫేక్ అని తేల్చింది. దీంతో అతడి వే సిన కేసును కొట్టిపారేసింది.