iDreamPost
android-app
ios-app

స్కూళ్లకు “మేజర్” స్పెషల్ ఆఫర్.. మెయిల్ చేస్తే టికెట్ పై 50శాతం రాయితీ

  • Published Jun 15, 2022 | 10:02 AM Updated Updated Jun 15, 2022 | 10:02 AM
  • Published Jun 15, 2022 | 10:02 AMUpdated Jun 15, 2022 | 10:02 AM
స్కూళ్లకు “మేజర్” స్పెషల్ ఆఫర్.. మెయిల్ చేస్తే టికెట్ పై 50శాతం రాయితీ

ముంబై ఉగ్రదాడుల్లో వీరమరణం పొందిన మేజర్‌ సందీప్‌ ఉన్నీకృష్ణన్‌ జీవితం ఆధారంగా.. అడివి శేష్ లీడ్ రోల్ లో తెరకెక్కిన సినిమా “మేజర్”. శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా జూన్ 3వతేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా ప్రతిఒక్కరూ చూడాల్సిన సినిమా అంటూ సినీ, రాజకీయ ప్రముఖులు కితాబిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి కూడా “మేజర్” పై ప్రశంసలు కురిపించారు. ఈ నేపథ్యంలో “మేజర్” చిత్రబృందం పాఠశాలలకు స్పెషల్ ఆఫర్ ప్రకటించింది.

మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం గురించి ప్రతి విద్యార్థి తెలుసుకోవాలన్న సదుద్దేశంతో పాఠశాలల యాజమాన్యాలకు టికెట్ ధరపై 50 శాతం రాయితీ ఇస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. పాఠశాలల యాజమాన్యాల కోసం ప్రత్యేకంగా షో వేస్తామని, ఇందుకోసం majorscreening@gmail.comకి మెయిల్‌ చేసి అవకాశాన్ని పొందాలని మేజర్‌ టీం తెలిపింది. కాగా.. మేజర్ సినిమాను సక్సెస్ చేసిన ప్రేక్షకులకు అడివి శేష్ ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యంగా చిన్నారుల నుంచి వస్తున్న స్పందన తనకెంతో సంతోషాన్నిచ్చిందన్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాను వారి కోసం రాయితీపై ప్రదర్శించాలని నిర్ణయించాం. గ్రూప్ టికెట్లపై పాఠశాలలకు రాయితీ కల్పిస్తున్నామని అడివి శేష్ తెలిపారు.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetCasinolevantCasinolevantholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişbigbossgrandpashabet