iDreamPost
android-app
ios-app

సర్కారు వారి పాట ఓపెనింగ్స్ టార్గెట్ రూ.100 కోట్లు, అద‌రగొట్టిన‌ అడ్వాన్స్ బుకింగ్స్..

  • Published May 11, 2022 | 5:27 PM Updated Updated May 11, 2022 | 6:23 PM
  • Published May 11, 2022 | 5:27 PMUpdated May 11, 2022 | 6:23 PM
సర్కారు వారి పాట ఓపెనింగ్స్ టార్గెట్ రూ.100 కోట్లు,  అద‌రగొట్టిన‌ అడ్వాన్స్ బుకింగ్స్..

మహేష్ బాబు, కీర్తి సురేష్ కలిసి నటించిన సినిమా సర్కారు వారి పాట. పరశురామ్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా మే 12న రాబోతుంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలుస్తుందని అంతా భావిస్తున్నారు. ఇప్పటికే అన్ని చోట్ల టికెట్ బుకింగ్స్ ఓపెన్ కాగా అడ్వాన్స్ బుకింగ్స్ కలెక్షన్సే కోట్లలో ఉన్నాయి. దీంతో ఈ సినిమా కలెక్షన్స్ కూడా అదిరిపోతాయని అంచనా వేస్తున్నారు.

ఇప్పటి వరకు ఈ సినిమా అమెరికాలో 634K డాలర్లు ప్రీమియర్ షోల ద్వారా సంపాదించింది. ఇది రాధేశ్యామ్, ఆచార్య, భీమ్లా నాయక్ కంటే ఎక్కువ. దాదాపు అయిదు కోట్లు ప్రీమియర్స్ ద్వారే కలెక్ట్ అవుతున్నాయి. ఇక UKలో కూడా అడ్వాన్స్ బుకింగ్స్ మీద ఇప్పటికే దాదాపు 72 లక్షల రూపాయలు వసూలు చేసింది.

ఒక్క హైదరాబాద్ లోనే సర్కారు వారి పాట సినిమా మొదటి రోజు దాదాపు 800 షోలు పడనున్నాయి. దీంతో మొదటి రోజే ఒక్క హైదరాబాద్ లోనే 8 కోట్లు కలెక్ట్ చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఈ సినిమా పాన్ ఇండియా సినిమా కాకపోయినా తెలుగు సినిమాగా అన్ని చోట్ల రిలీజ్ అవ్వనుంది.

ఇక సర్కారు వారి పాట సినిమాకి హైప్ బాగా ఉండటంతో ఇప్పటికే ప్రీ సేల్స్ విపరీతంగా జరుగుతున్నాయి. దీంతో ఈ సినిమా మొదటి మూడు రోజుల్లోనే ఈజీగా 100 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధిస్తుందని సమాచారం. ఇక సినిమా మొత్తం దాదాపు 250 నుంచి 300 కోట్ల వరకు వసూళ్లు సాదిస్తుందని టాలీవుడ్ వర్గాలు అంచనా వేస్తున్నారు. ఒక రీజినల్ సినిమాగా రిలీజ్ అయి ఈ రేంజ్ లో వసూళ్లు సాధిస్తే ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ గా చెప్పొచ్చు.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetstarzbetstarzbetStarzbetjojobetgrandpashabetcasibomcasibomcasibombetcio giriş