iDreamPost
android-app
ios-app

మొదటిసారి స్టేజిపై మహేష్ స్టెప్పులు

  • Published May 17, 2022 | 10:10 AM Updated Updated May 17, 2022 | 11:23 AM
  • Published May 17, 2022 | 10:10 AMUpdated May 17, 2022 | 11:23 AM
మొదటిసారి స్టేజిపై మహేష్ స్టెప్పులు

ఎన్నడూ లేనిది ఒక పబ్లిక్ స్టేజి మీద మహేష్ బాబు తమన్ తో కలిసి డాన్స్ చేశారు. సర్కారు వారి పాట సక్సెస్ ఇచ్చిన కిక్ అలాంటిది మరి. నిన్న కర్నూలు ఎస్టిబిసి గ్రౌండ్స్ లో జరిగిన గ్రాండ్ ఈవెంట్ లో ప్రిన్స్ కొన్ని క్షణాల పాటు నృత్యం చేయడం, ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడం చూస్తూ అభిమానుల సంబరం మాములుగా లేదు. ఎప్పుడో ఒక్కడు షూటింగ్ కోసం ఏళ్ళ క్రితం అడుగుపెట్టిన మహేష్ బాబు మళ్ళీ తిరిగి ఈ సీమకు రావడం ఇదే. అందుకే ఆ ఉద్వేగం తాలూకు ఫలితమో లేక ఊహించిన దానికన్నా ఎక్కువ హిట్టు దక్కిందన్న ఆనందమో తెలియదు కానీ కిక్కిరిసిపోయిన జనం ముందు మహేష్ ఇచ్చిన కిక్ మాములుగా లేదు.

ప్రొడక్షన్ హౌస్ చెప్పిన ప్రకారం ఇప్పటిదాకా 95 కోట్ల షేర్ రాబట్టిన సర్కారు వారి పాట ఇవాళ వంద మార్కుని అందుకోవడం లాంఛనమే. థియేటర్లన్నీ హౌస్ ఫుల్ బోర్డ్స్ పడకపోయినా మెయిన్ సెంటర్స్ లో మాత్రం బాబు దూకుడు మాములుగా లేదు. ఎంత పెద్ద సినిమా అయినా సహజంగా ఉండే మండే డ్రాప్ సర్కారు వారి పాటకు కూడా తగిలింది. కాకపోతే ఆ పర్సెంటెజ్ ఎంత ఉందనేది తెలియాల్సి ఉంది. ఫైనల్ రన్ కు ఇంకా చాలా టైం ఉంది. ఈ వారం విడుదలవుతున్న శేఖర్, దగడ్ సాంబల ప్రభావం అంతగా ఉండదు కాబట్టి ఇంకో వారం బాక్సాఫీస్ మహేష్ కంట్రోల్ లో ఉంటుంది. మే 27 ఎఫ్3 వచ్చాక సమీకరణాలు మారిపోతున్నాయి.

ఇక ఈ విజయం తాలూకు వైబ్రేషన్స్ మహేష్ స్పీచ్ లో కనిపించాయి. సినిమా చూడగానే నాన్న కృష్ణగారు ఇది పోకిరి దూకుడులను దాటేస్తుందని చెప్పారని, గౌతమ్ కౌగిలించుకోవడం, ఇందులో చాలా అందంగా ఉన్నావని బాగా యాక్ట్ చేశావని సితార మెచ్చుకోవడం లాంటివన్నీ షేర్ చేసుకున్నాడు. రాయలసీమకు రావడం పట్ల ఆనందం వ్యక్తం చేయడం హైలైట్ అయ్యింది. మొత్తానికి రెగ్యులర్ స్టైల్ లో ఏ హైదరాబాద్ లోనో వైజాగ్ లోనో సక్సెస్ ఈవెంట్ చేయకుండా కర్నూలుని ఎంచుకోవడం మంచి రిజల్ట్ ఇచ్చింది. ఆ మధ్య అఖండ విజయోత్సవం కూడా ఇక్కడే జరిగిన సంగతి తెలిసిందే. రేపటితో సర్కారు వారి పాట మొదటి వారం పూర్తవుతుంది

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss