iDreamPost
android-app
ios-app

బాలీవుడ్ పై మహేష్ వ్యాఖ్యలు వివాదాస్పదం.. వివరణ ఇచ్చిన మహేష్..

  • Published May 11, 2022 | 4:49 PM Updated Updated May 11, 2022 | 4:49 PM
  • Published May 11, 2022 | 4:49 PMUpdated May 11, 2022 | 4:49 PM
బాలీవుడ్ పై మహేష్ వ్యాఖ్యలు వివాదాస్పదం.. వివరణ ఇచ్చిన మహేష్..

సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటించిన సర్కారు వారి పాట సినిమా మే 12న రిలీజ్ అవుతుండటంతో ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. ఇటీవల మహేష్ నిర్మించే మేజర్ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో ఓ విలేఖరి అందరూ పాన్ ఇండియా అంటున్నారు, బాలీవుడ్ లో సినిమాలు రిలీజ్ చేస్తున్నారు మరి మీరు బాలీవుడ్ సినిమా ఎప్పుడు చేస్తారు అని అడిగారు.

దీనికి మహేష్ సమాధానమిస్తూ.. బాలీవుడ్ నన్ను భరించలేదు. నా టైం వేస్ట్ చేసుకోను. నాకు స్టార్ డం, పేరు ఇక్కడే(Tollywood) వచ్చాయి. నేను తెలుగు సినిమాలు తీయడానికే ప్రాధాన్యత ఇస్తాను. నా దృష్టి తెలుగు సినిమాపైనే వుంది. తెలుగు సినిమానే బాలీవుడ్ కి రీచ్ కావాలని కోరుకుంటాను అని అన్నారు. అయితే ఈ వ్యాఖ్యలు తప్పుగా ప్రచారం చేయడంతో వివాదం చెలరేగింది.

దీంతో మహేష్ బాలీవుడ్ పై చేసిన వ్యాఖ్యలకి తాజాగా మరో ఇంటర్వ్యూలో వివరణ ఇచ్చారు. మహేష్ మాట్లాడుతూ.. నాకు సినిమా అంటే ఇష్టం. నేను అన్ని భాషలను గౌరవిస్తాను. నేను పనిచేస్తున్న తెలుగు సినీ పరిశ్రమ నాకు సౌకర్యంగా ఉంది. జాతీయ స్థాయిలో తెలుగు సినిమాలు దూసుకెళ్తుండటం ఆనందంగా ఉంది. నేను తర్వాత చేయబోయే రాజమౌళి సినిమా పాన్ ఇండియా సినిమానే అని తెలిపారు. మహేష్ త్వరలోనే బాలీవుడ్ లో కూడా అడుగుపెట్టనున్నారు అని ఫ్యాన్స్ ఆనందిస్తున్నారు.

 

 

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişgrandpashabetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişcasibom