iDreamPost
android-app
ios-app

Mahesh PAN India Film : టైమొచ్చేసింది అంటున్న మహేష్

Mahesh PAN India Film : టైమొచ్చేసింది అంటున్న మహేష్

సూపర్ స్టార్ మహేష్ బాబు ఎక్కువగా ప్రయోగాల జోలికి వెళ్ళకుండా ఉండటానికి ప్రయత్నిస్తుంటారు. కెరీర్ లో ప్రయోగాత్మకంగా చేసిన అన్ని సినిమాలు నెగిటివ్ రిజల్ట్ వచ్చిన కారణంగా ఆయన ప్రయోగాత్మక సినిమాలకు దూరంగా ఉంటారు. మురుగదాస్ దర్శకత్వంలో చేసిన స్పైడర్ అనే బై లింగ్యువల్ సినిమా ఊహించిన ఫలితాలు రావడంతో అప్పటి నుంచి ఆయన ఇతర భాషలలో సినిమాలు చేయడానికి చాలా ఆలోచిస్తున్నారు.. వాస్తవానికి ఆయనకు హిందీ సినిమా ఇండస్ట్రీ నుంచి చాలా ఆఫర్లు వచ్చాయి కానీ ఒక్క సినిమా కూడా చేయడానికి మహేష్ సిద్ధపడలేదు. అయితే ఆయన హిందీలో సినిమాలు ఎందుకు చేయడం లేదు అనే విషయం మీద తాజాగా స్పందించారు.

ఫోర్బ్స్ ఇండియా మహేష్ బాబుతో ఒక ఇంటర్వ్యూ నిర్వహించింది. ఈ ఇంటర్వ్యూ లోనే మహేష్ ఈ విషయంతో పాటు పలు కీలక విషయాలను వెల్లడించారు. ముఖ్యంగా హిందీ సినిమాల్లో ఎందుకు నటించడం లేదు అనే విషయం మీద కూడా ఆయన స్పందించారు. హిందీలో ఎంట్రీ ఇవ్వడానికి సరైన సమయంలో సరైన సినిమా కోసం ఎదురు చూస్తున్నానని, ఇప్పుడు సరైన సమయం వచ్చేసింది అని చెప్పుకొచ్చారు. తన తరువాతి సినిమా ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో ఉండబోతోందని అది అన్ని ఇండియా భాషలలో విడుదల కాబోతోందని మహేష్ చెప్పుకొచ్చారు.

ఇక చాలా దక్షిణాది సినిమాలను హిందీలో రీమేక్ చేస్తున్నారు కదా నెమ్మదిగా సినిమాల మధ్య భాషా భేదం తొలగి పోతునట్టేనా అని ప్రశ్నిస్తే ఒక మంచి సినిమాని ఎవరు ఎక్కడైనా రీమేక్ చేసుకోవచ్చు అనేది తన పర్సనల్ ఒపీనియన్ అని అది ఏ భాషలో అయినా బాగానే ఆడుతుందని మహేష్ చెప్పుకొచ్చారు. ఓటీటీ వచ్చాక ఈ యాక్సెస్ మరింత పెరిగిందని మహేష్ బాబు చెప్పుకొచ్చారు. అయితే కేవలం దక్షిణాది భాషకే ఎందుకు పరిమితం అయ్యారు అని ప్రశ్నిస్తే మాత్రం నేను దక్షిణాదిలో పుట్టాను కాబట్టి ఇక్కడ సక్సెస్ ఫుల్ గా ఎదగడానికి ముందు ప్రాధాన్యత ఇచ్చానని ఆ విషయంలో ఎలాంటి మార్పులు లేవు అని చెప్పుకొచ్చారు. సినిమా రిలీజ్ విషయంలోనే దక్షిణాది ఉత్తరాది అనేది చూస్తారు తప్ప ప్రేక్షకులకు అన్ని సినిమాలు ఒక్కటేనని ఆయన చెప్పుకొచ్చారు.

Also Read : Raktha Sambandham : రక్త సంబంధం రిపోర్ట్