iDreamPost
android-app
ios-app

రైలులో ట్రాన్సజెండర్ తో పరిచయం, ఆపై ప్రేమ.. కట్ చేస్తే!

  • Published Jun 14, 2023 | 6:34 PM Updated Updated Jun 14, 2023 | 6:34 PM
  • Published Jun 14, 2023 | 6:34 PMUpdated Jun 14, 2023 | 6:34 PM
రైలులో ట్రాన్సజెండర్ తో పరిచయం, ఆపై ప్రేమ.. కట్ చేస్తే!

ప్రేమంటే మాటల్లో వర్ణించలేని మధురమైన అనుభూతి. ప్రేమ ఏంత గొప్పదో వర్ణించడానికి మాటలు చాలవు. కేవలం దాన్ని అనుభూతి చెందాలి.. ఆస్వాదించాలి. దైవం కన్నా గొప్పది ప్రేమ. చరిత్రలో ప్రేమ కోసం జరిగిన యుద్ధాలెన్నో. ప్రేమించడం సులువే. కానీ ఆ ప్రేమని పెళ్లి బంధం వరకు తీసుకెళ్లి.. జీవితాంతం దాన్ని నిలబెట్టుకోవడం అంత సులభం కాదు. నిజమైన ప్రేమ.. పేద, ధనిక అంతరాలను చూడదు.. వైకల్యాలు పట్టించుకోదు. ప్రేమించే మనసు మాత్రమే దానికి ముఖ్యం. కానీ నేటి కాలంలో ప్రేమ పేరుతో కొందరు వేసే వేషాలు చుస్తే అసహ్యం కలుగుతుంది. ఆ విషయం కాసేపు పక్కన పెడితే.. స్వచ్ఛమైన ప్రేమకు నిదర్శనంగా నిలిచే సంఘటన చోటు చేసుకుంది. ఆ వివరాలు..

ట్రాన్సజెండర్ ని ప్రేమించి.. పెళ్లి చేసుకుని.. నిజమైన ప్రేమకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచాడు ఓ యువకుడు. మహబూబాబాద్ జిల్లాలో ఈ ఆసక్తికర వివాహం జరిగింది. ట్రైన్ లో ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారి.. చివరకు.. మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. మహబూబాబాద్ జిల్లా, గార్ల మండలం అంజనాపురం గ్రామానికి చెందిన ట్రాన్స్‌జెండర్ బానోత్ రాధిక (28)కు.. డోర్నకల్ మండలం సిగ్నల్ తండాకు చెందిన ధారావత్ వీరుతో (30) రెండేళ్ల క్రితం ట్రైన్‌లో పరిచమయ్యాడు. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది.

ఇద్దరూ ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నారు. ఒకరిని విడిచి ఒకరు ఉండలేని పరిస్థితి. దాంతో వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కానీ వీరి బంధాన్ని కుటుంభ సభ్యులు ఆమోదించలేదు. దాంతో వీరు తమకు పెళ్లి చేయమని కోరుతూ ట్రాన్స్‌జెండర్ల సంఘాన్ని ఆశ్రయించటంతో.. వాళ్లంతా వీరు-రాధికలకు మద్దతుగా నిలిచారు. ఆతర్వాత గార్ల మండలం మర్రిగూడెం గ్రామంలోని వేట వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వేదమంత్రాల సాక్షిగా బంధుమిత్రుల సమక్షంలో వివాహం జరిగింది.