నటుడు మాధవన్ నటిస్తూ, స్వీయ దర్శకత్వం వహించిన చిత్రం ‘రాకెట్రీ.. ది నం బి ఎఫెక్ట్’. ఈ సినమా ప్రముఖ ఇస్రో శాస్త్రవేత్త నం బి నారాయణన్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందించారు. ఈ సినిమా జులై 1వ తేదీన విడుదలైంది. రివ్యూలతో పాటు ప్రేక్షకులు సైతం ఈ సినిమాను ఆదరించగా, దాదాపు 40 కోట్ల వసూళ్ళు రాబట్టిందని అంటున్నారు. తాజాగా ఈ సినిమా ఓటీటీ అప్ డేట్ ను ప్రకటించింంది చిత్ర బృందం.
సుమారు 25 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ ద్వారా ఓటీటీ ప్రేక్షకుల్ని పలకరించేందుకు సిద్ధమైంది. తెలుగు, మలయాళం, తమిళ, కన్నడ భాషల్లో రాకెట్రీ సినిమా అందుబాటులోకి రానుంది. జులై 26 నుంచి అమెజాన్ ప్రైమ్ లో సందడి చేసేందుకు సిద్ధయ్యాడు మాధవన్.
ఈ సందర్భంగా ఒక పోస్టర్ ను సైతం విడుదల చేశారు. నంబి నారాయణన్ విద్యాభ్యాసం నుంచి ఆయన ఎదుర్కొన్న ఆరోపణలు నిజం కాదని నిరూపితమయ్యేవరకు ఆయన జీవితంలో జరిగిన వివిధ సంఘనటల సమాహారమే ఈ చిత్రం.