లవ్ స్టోరీకి లక్కీ ఛాన్స్

నాగ చైతన్య, సాయి పల్లవి ఫస్ట్ టైం కాంబినేషన్ లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న లవ్ స్టోరీ విడుదల తేదీ ఇంకా ఖరారు కాకుండానే సాలిడ్ డీల్స్ దక్కించుకుంటోంది. ఇంకా కొంత బాలన్స్ వర్క్ పూర్తి చేయాల్సి ఉన్నప్పటికీ నాన్ థియేట్రికల్ డీల్స్ ని క్లోజ్ చేశారట . విశ్వసనీయ సమాచార ప్రకారం వీటి విలువ 16 కోట్ల రూపాయలకు ఫైనల్ అయ్యిందని తెలిసింది. శాటిలైట్ హక్కులు స్టార్ మా ఛానల్ కు, డిజిటల్ స్ట్రీమింగ్ ఆహాకు ఇచ్చేయగా పైన చెప్పిన మొత్తంలో హింది డబ్బింగ్ రైట్స్ కూడా ఉన్నాయి. కమర్షియల్ అంశాలు లేని ఒక ప్రేమ కథకు ఇంత భారీ ధర దక్కడం బట్టి చూస్తే ఈ కాంబోకున్న క్రేజ్ ఏంటో అర్థమవుతోంది.

మజిలి తర్వాత చైతు సినిమా వచ్చి ఏడాది దాటింది. సాయి పల్లవి పడి పడి లేచే మనసు తర్వాత తెలుగులో స్ట్రెయిట్ మూవీ చేయలేదు. అందులోనూ ఫిదా లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చాక శేఖర్ కమ్ముల సైతం చాలా గ్యాప్ తీసుకున్నారు. ఇవన్ని కలిసి లవ్ స్టొరీ మీద మంచి బజ్ తీసుకొచ్చాయి. అందుకే ఆశించిన దాని కన్నా మంచి రేట్లు లవ్ స్టొరీ దక్కించుకుంది. కరోనా లాక్ డౌన్ లేకపోయి ఉంటె గత మే నెలలోనే లవ్ స్టొరీ థియేటర్లలో రిలీజ్ అయ్యేది. కాని ఇప్పటికిప్పుడు ఆ ఛాన్స్ లేదు. బాలన్స్ వర్క్ పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ కి సమయం కేటాయించి సరైన సమయంలో లవ్ స్టొరీని విడుదల చేసే ఆలోచనలో నిర్మాతలు ఉన్నారు. ఇప్పటిదాకా వచ్చిన లిరికల్ సాంగ్స్, టీజర్, పోస్టర్స్ కు మంచి స్పందన వచ్చింది.

యూత్ లోనూ మంచి ఆసక్తి నెలకొంది. అన్ని అనుకూలంగా సాగితే లవ్ స్టోరీ అక్టోబర్ లో లేదా నవంబర్ లో వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొన్ని మీడియా వర్గాల్లో పేర్కొన్నట్టుగా వచ్చే ఏడాదికి పోస్ట్ పోన్ చేసినట్టు యూనిట్ నుంచి ఎలాంటి సమాచారం లేదు. బజ్ పరంగా లవ్ స్టోరీ మంచి బిజినెస్ చేయడం ఖాయం . సున్నితమైన ప్రేమకథలను ఎమోషన్స్ తో తెరకెక్కించడంలో పేరున్న శేఖర్ కమ్ముల ఈ సినిమాలోనూ డిఫరెంట్ పాయింట్ తో తన మార్క్ టేకింగ్ తో తెరకెక్కించినట్టు ఇన్ సైడ్ టాక్. టైటిల్ లోనే లవ్ ఉంది కాబట్టి ఇంకే స్థాయిలో ఇందులో ప్రేమ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. షూటింగులు తిరిగి మొదలయ్యాక లవ్ స్టొరీకి సంబంధించి మరిన్ని క్లియర్ అప్ డేట్స్ వచ్చే అవకాశం ఉంది

Show comments