iDreamPost
iDreamPost
ఎక్కడో ఉంటారు. యాప్ లో లోన్ ఇస్తారు, కాల్స్ తో వేధిస్తారు. ఇచ్చిన అప్పు తీర్చినా, కొందరికి వేధింపులు తప్పడంలేదు. మంచిర్యాల ఘటన మరవకముందే ఖమ్మం జిల్లా మధిరలో మరో ఘటన వెలుగులోకి వచ్చింది.
‘నువ్వు తీసుకున్న అప్పు పూర్తిగా తీరలేదు. ఇంకా కట్టాలి. లేకపోతే, మీ అమ్మ ఫోటోను మార్ఫింగ్ చేసి, పోర్న్‌సైట్‌లో అప్‌లోడ్ చేస్తాం’ ఇది లోన్ యాప్ నిర్వాహకులు బెదిరింపులు. తీసుకున్న లోన్ ను పూర్తిగా చెల్లించినా, ఆ ఫీజులు, ఈ ఫీజులంటూ ఆన్‌లైన్ లోన్ యాప్ నిర్వాహకులు ఓ యువకుడిని వేధిస్తున్నారు. ఆయన తల్లి ఫొటోను మార్ఫింగ్ చేసి, కాంటాక్ట్ లోని ఇతరులకు పంపిస్తున్న దారుణం ఇది.
ప్రదీప్ ది మధిర. అవసరమై, ఆన్‌లైన్ యాప్ ద్వారా రుణం తీసుకున్నాడు. వాళ్లు అడిగితే ప్రదీప్ ఆధార్‌కార్డుతో పాటు, తల్లి పాన్‌కార్డును యాప్ ఏజంట్లు తీసుకున్నారు. అయితే, తీసుకున్న లోన్ ను తిరిగి చెల్లించడానికి ప్రయత్నిస్తే, వెబ్‌సైట్ పనిచేయలేదు. నిర్వాహకులకు ఫోన్ చేస్తే, యూపీఐ లింక్ పంపారు. దాన్ని బట్టి మనీ చెల్లించాడు.
లోన్ పూర్తిగా కట్టేశాడు. అయినా, ఇంకా బకాయి ఉందంటూ ప్రదీప్‌ను ఫోన్ చేసి వేధించారు. రకరకాల ఫోన్ నెంబర్ల నుంచి ఫోన్లు. వాళ్లు ఎంతుకు బరితెగించారంటే, ప్రదీప్ తల్లి పాన్‌కార్డులోని ఫొటోను మార్ఫింగ్ చేశారు. అంతేగాక ఆయన ఫోన్‌లో నంబర్లు ఉన్న వాళ్లకు, ఆమె మోసాలకు పాల్పడుతోందంటూ, మెసెజ్‌లు పంపుతున్నారు. ప్రదీప్ చేసిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదుచేశారు.