iDreamPost
android-app
ios-app

liger లైగర్ – ఇద్దరికీ డూ ఆర్ డై

  • Published Jul 12, 2022 | 3:03 PM Updated Updated Jul 12, 2022 | 3:03 PM
  • Published Jul 12, 2022 | 3:03 PMUpdated Jul 12, 2022 | 3:03 PM
liger లైగర్ – ఇద్దరికీ డూ ఆర్ డై

రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ దర్శకుడు పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో రూపొందుతున్న లైగర్ మీద అంచనాలు మెల్లగా ఎగబాకుతున్నాయి. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో మైక్ టైసన్ ఓ కీలక పాత్ర పోషించగా సుమారు 100 కోట్లకు పైగా బిజినెస్ టార్గెట్ తో ప్యాన్ ఇండియా లెవల్ లో ఆగస్ట్ 25న బరిలో దిగనుంది. దీని కోసం విజయ్ పడరాని పాట్లు పడ్డాడు. అకిడి పకిడి పాట కోసం మాస్ స్టెప్పులు వేశాడు. దాదాపు నగ్నంగా ఫస్ట్ లుక్ పోస్టర్ కోసం స్టిల్ ఇచ్చాడు. రాబోయే రోజుల్లో టీజర్, ట్రైలర్ తో ఈ హైప్ ని ఇంకా పీక్స్ కి తీసుకెళ్లే ప్రయత్నంలో ఉంది పూరి అండ్ ఛార్మీ టీమ్. కరణ్ జోహార్ కూడా నిర్మాణ భాగస్వామి కాబట్టి ప్లానింగ్ వేరే లెవెల్ లో జరుగుతోంది.

లైగర్ సక్సెస్ కావడం విజయ్ పూరిలకు ఇద్దరికీ చాలా కీలకం. డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్ ఫలితాలు దేవరకొండ హీరోని సెలక్షన్ పట్ల హెచ్చరికగా ఉండేలా ఫలితాన్నిచ్చాయి. కేవలం తన ఇమేజ్ తోనే హిట్లు కొట్టలేమని కంటెంట్ కూడా బలంగా ఉండాలని అర్థమైపోయింది. అందుకే మార్కెట్ లో డౌన్ అయిన ఇమేజ్ ని తిరిగి లైగర్ తో డబుల్ చేసుకునే కసితో ఉన్నాడు. ఇక పూరి గత సినిమా ఇస్మార్ట్ శంకర్ గాలివాటం హిట్టు కాదని ఋజువు చేసుకోవాలి. ఒకప్పుడు తన వల్ల స్టార్స్ అయినవాళ్లు తిరిగి వచ్చేలా దీంతో ప్రూవ్ చేయాలనే సంకల్పం పెట్టుకున్నాడు. అందుకే ఇద్దరూ లైగర్ ని డూ ఆర్ డై తరహాలో ట్రీట్ చేస్తున్నారు

ఇది బాగా వచ్చిందనే నమ్మకంతోనే వెంటనే జనగణమన అనౌన్స్ చేశారనే టాక్ ఇప్పటికే ఉంది. ఎందుకంటే లైగర్ ఫలితం ఒకవేళ అటుఇటు అయితే దాని ప్రభావం నేరుగా నెక్స్ట్ రాబోయే ప్రాజెక్టు మీద పడుతుంది. అలాంటిదేమి ఆలోచించకుండా లైగర్ రిలీజ్ డేట్ ఫిక్స్ చేయడానికి ముందే మరోసారి కాంబో సెట్ చేసుకోవడం కాన్ఫిడెన్స్ గానే చెప్పాలి. లైగర్ రిజల్ట్ డిసెంబర్ లో రిలీజ్ కాబోయే ఖుషి మీద కూడా ఉంటుందని విజయ్ కు తెలుసు. అందుకే దీన్ని బ్లాక్ బస్టర్ చేసుకుంటే ఆ తర్వాత వచ్చేవి ఎక్కువ రేట్లు పలుకుతాయి. కెజిఎఫ్ హీరో యష్ లాంటి వాళ్ళం టార్గెట్ పెట్టుకున్న పూరి జగన్నాధ్ కు ఈ రెండు సక్సెస్ అయితే మాత్రం దశ తిరిగినట్టే.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş