iDreamPost
iDreamPost
ఐపీఎల్-2022, మంగళవారం(మే 3) గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ గెల్చింది. భారీ హిట్టర్ గా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పేరుని, అతని మీద పెట్టిన పెట్టుబడికి తగినేట్లుగానే ఒక్క సిక్సర్ తో వావ్ అనిపించాడు. గుజరాత్ పేసర్ మహ్మద్ షమీ 16 ఓవర్ వేసిన షమీ బౌలింగ్‌లో 3 సిక్స్‌లు, 2 ఫోర్లు బాదాడు. ఒక్క ఓవర్ లోనే ఏకంగా 28 పరుగులు సాధించాడు.
ఈ ఓవర్‌లోనే తొలి బంతికి లివింగ్‌స్టోన్ 117 మీటర్ల భారీ సిక్స్ బాదాడు. ఈ ఐపీఎల్‌లో ఇదే లాంగెస్ట్ సిక్స్. స్టేడియం అంచులదాకా వెళ్లిన ఈ సిక్సర్ ను చూసి, పంజాబ్ కెప్టెన్ నోరెళ్లబెడితే, బౌలర్ షమీ నవ్వేశాడు. ఇక కామెంటేటర్లకి పూనకం వచ్చేసింది. ఆ తర్వాత వరసగా మరో రెండు సిక్సర్లు. 10 బంతుల్లోనే లివింగ్‌స్టోన్ 30 పరుగులు సాధించాడు.
ఇంతకు ముందు ముంబై ఇండియన్స్ కుర్ర ఆటగాడు డెవాల్డ్ బ్రేవిస్ 112 మీటర్ల భారీ సిక్స్ బాదాడు. ఇక ఈ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌పై పంజాబ్ కింగ్స్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. పాయింట్ల పట్టికలో ఎగబాకింది. ప్లే ఆఫ్ మీద ఆశ పెంచుకుంది.
That's that from Match 48.@PunjabKingsIPL win by 8 wickets with four overs to spare.
Scorecard – https://t.co/LcfJL3mlUQ #GTvPBKS #TATAIPL pic.twitter.com/qIgMxRhh0B
— IndianPremierLeague (@IPL) May 3, 2022