రాజధాని అమరావతి ప్రాంతంలోభూ లావాదేవీల్లో రాజకియ నాయకులు బడా వ్యాపారులు తమ బినామిల పేరుమీద భారీ ఎత్తున ఇన్ సైడ్ ట్రేడింగ్ కి పాల్పడినట్టు బలమైన ఆధారాలు లభించడంతో ఇప్పటికే బాధ్యులను గుర్తించి నేపధ్యంలో వారిపై న్యాయ పరమైన చర్యలు తీసుకోవడానికి రంగం సిద్దమైనట్టు తెలుస్తుంది.
ఇప్పటికే ఆమరావతిలో భారీ ఎత్తున ఇన్ సైడ్ ట్రేడింగ్ జరిపినట్టు ఆధారాలు సేకరించామని రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర నాధ రెడ్డి అసెంబ్లీలో పలువురు అప్పటి అధికార పక్షమైన తెలుగుదేశానికి చెందిన పలువురు నేతలు పేర్లు ప్రస్తావించడంతో ఇప్పుడు ప్రభుత్వం తీసుకునే చర్యలపై సర్వత్రా ఆసక్తి నెలకుంది.
విశ్వసనీయ సమాచారం ప్రకారం 2014-15 మధ్య జరిగిన భూ క్రయ విక్రయాలపై గత 6 నెలల నుండి గుంటూరు కృష్ణా జిల్లాల పరిధిలోని గ్రామాల్లో అత్యంత రహస్యంగా విచారణ విజిలెన్స్, ఏసీబీ, సీఐడీల చేత విచారణ జరిపించిన ప్రభుత్వం రెండు జిల్లాలోని వివిద సబ్ రిజిస్ట్రాలు జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయాల్లోని రిజిస్ట్రేషన్ ల వివరాలు అయా అధికారుల నుండి సేకరించారు.
గత ప్రభుత్వం హయంలో కీలకంగా ఉన్న కొందరు నేతలు అధికారులు వారి పేరుతో పాటు వారి బినామిల పేరు మీద కొన్న భూమి వివరాలను సేకరించినట్టు తెలుస్తుంది. ప్రధానంగా 2014లో రాష్ట్ర విభజన అనంతరం అమరావతి రాజధాని ప్రకటన, భూ సమీకరణ నోటిఫికేషన్ వచ్చే ముందు అంటే 2014 డిసెంబర్ 30 వరకు సేకరించిన వివరాల ప్రకారం దాదాపు 4,070 ఎకరాలను తెలుగుదేశం మంత్రులు శాసనసభ్యులు మరియు వారి బినామిలు కొనుగోలు చేసినట్టు ప్రాధమికంగా నిర్ధారించారు.
వీరిపై చట్టపరంగా తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వం సమాలోచనలు జరుపుతునట్టు అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వానికి ఈ అక్రమ లావాదేవీలపై దర్యాప్తు నివేదికలు ప్రభుత్వానికి సమర్పించినట్టు తెలుస్తుంది. రాబోయే అసెంబ్లీ సమావేశాల నాటికి ఇందుకు సంబంధీంచిన పూర్తి స్థాయి నివేదిక ని సిద్దం చేసి తెలుగుదేశం నేతల చుట్టూ ఉచ్చు బింగించాలని తద్వారా ఈ అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని జగన్ ప్రభుత్వం భావిస్తుంది.