iDreamPost
android-app
ios-app

Netflix నెట్‌ఫ్లిక్స్ టిప్స్ అండ్ ట్రిక్స్, బెస్ట్ సినిమాల‌ను ఎలా క‌నిపెట్టాలి?

  • Published Jul 28, 2022 | 8:29 PM Updated Updated Jul 28, 2022 | 8:29 PM
Netflix  నెట్‌ఫ్లిక్స్ టిప్స్ అండ్ ట్రిక్స్, బెస్ట్ సినిమాల‌ను ఎలా క‌నిపెట్టాలి?

Netflix అడ్వెంచర్, సైన్స్ ఫిక్షన్, సస్పెన్స్, ట్రూ క్రైమ్, రొమాన్స్, హారర్, కామెడీ ఇలా సినిమా ఫ్యాన్ కి భిన్న‌రుచుల కంటెంట్‌ను అందిస్తుంది. నెట్ ఫ్లిక్స్ లో సినిమాల‌ను వెత‌క‌డంకూడా చాలామందికి ఇష్ట‌మైన వ్యాప‌కం. అదో ఎడిక్ష‌న్ కూడా. నిజానికి, మీకు న‌చ్చిన వాటిని క‌నిపెట్ట‌డంకూడా కష్టమే. అందుకే, స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్ కొన్ని ట్రిక్స్ వాడుతుంది. ఫీచ‌ర్స్ ను ఇస్తోంది. మీరు ఏం చూడాలో ఆల్గోరిథ‌మ్ తో అంచ‌నావేసి, మీకు చూడాల్సిన సినిమాలు, వెబ్ సీరీస్ ను అందిస్తుంది.

ఇంత‌కీ నెట్ ఫ్లిక్స్ ట్రిక్స్ ఏంటి? మీ టేస్ట్ కు త‌గ్గ‌ట్టుగా ఎక్కువ మంది చూస్తున్న సినిమాలు, వెబ్ సీరీస్ అందించే Netflix ఫీచర్లు చాలానే ఉన్నాయి.

1. ఇలాంటివి మరికొన్ని More Like This

ఈ “ఇలాంటి మరికొన్ని” ఫీచర్ మీరు చూస్తున్న కంటెంట్ లాంటి షోలు లేదంటే సిరీస్‌లను ఎంపిక చేసి మీకు అందిస్తుంది. ఈ ఫీచ‌ర్ ని వాడాలంటే సినిమా, వెబ్ సీరీస్ ఓపెన్ చేసి , క్రిందికి స్క్రోల్ చేసి, More Like This ట్యాబ్‌పై నొక్కండి. అచ్చం అలాంటి జాన‌ర్ లో సినిమాలు, వెబ్ సీరీస్ కింద‌న క‌నిపిస్తాయి.

2. కిడ్స్ మిస్టరీ బాక్స్ Kids Mystery Box

కిడ్స్ కోసం పేరెంట్స్ కిచ్చిన ఫీచ‌ర్ ఇది. Netflix కొత్త కిడ్స్ మిస్టరీ బాక్స్ ఫీచర్ కోసం మీరు పిల్లల ప్రొఫైల్‌కి లాగిన్ చేయాలి, హోమ్‌పేజీ పైన‌ పిల్లలకు ఇష్టమైన వరుసని క‌నిపెట్టి ‘మిస్టరీ బాక్స్’ను వాడాలి.

3. నన్ను ఆశ్చర్యపరచు Surprise Me

మీకు మూడ్ బాగాలేదు. ఏం చూడాలో తెలియ‌డంలేదు. అలాంట‌ప్పుడు మిమ్మ‌ల్ని ఇంప్రెస్ చేసే అవ‌కాశం నెట్ ఫ్లిక్స్ కి ఇవ్వండి. Surprise Me ఫీచర్‌ని వాడండి. మీ టేస్ట్, మీరు చూస్తున్న షోలను బ‌ట్టి సిరీస్ , సినిమాని ప్లే చేస్తుంది. ఈ “సర్ప్రైజ్ మి” ఫీచర్ హోమ్‌పై స్క్రీన్ కుడి వైపున కింద‌న ఉంటుంది. స్మార్ట్ టీవీలో కూడా కనిపిస్తుంది. ఒక్క‌సారి క్లిక్ చేయండి, నిజంగా స‌ర్ ప్రైజ్ అవుతారు.

4. టాప్ 10 Top 10
మీకు ఏవి మంచి సినిమాలు, సీరీస్ తెలియ‌దు. అంద‌రూ ఏం చూస్తున్నారో అదే మీరూ చూడాల‌నుకొన్న‌ట్ల‌యితే మీరు ప్లాట్‌ఫారమ్‌లో టాప్ 10 ట్రెండింగ్ సినిమాలు, సినిమాల సెక్ష‌న్ ను ఎంచుకోవచ్చు. టాప్ 10 సినిమాల లిస్ట్ క‌నిపిస్తుంది. న‌చ్చింది చూసేయండి.

5. గ్లోబల్ టాప్ 10 జాబితా Global Top 10 list
ఇండియాలో ట్రెండిండ్ కంటెంట్ అంతా చూసేశారు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ట్రెండింగ్ కంటెంట్‌ను చూడాలనున్నారు. ఇది చాలా సింపుల్. మీరు నెట్ ఫ్లిక్స్ టాప్ 10 వెబ్‌సైట్ కు వెళ్లండి. https://top10.netflix.com ఈ లింక్ ను క్లిక్ చేస్తే 4 విభాగాలలో టాప్ 10 సినిమాలు, సిరీస్‌ల జాబితాను చూడొచ్చు.