iDreamPost
iDreamPost
లాల్ సింగ్ చద్దా. 1994 ఆస్కార్ విన్నర్, హాలీవుడ్ క్లాసిక్, ఫారెస్ట్ గంప్ ఆధారంగా తీర్చిదిద్దిన సినిమా. ఫారెస్ట్ గంప్ లో, అమెరికా చరిత్రతో టామ్ హాంక్స్ పాత్ర ఎదుగుతుంది. కీలక రాజకీయ, చారిత్రక సన్నివేశాలకు సాక్షి అవుతుంది. లాల్ సింగ్ చద్దా కూడా భారతదేశంలోని కీలక ఘట్టల్లో ఉంటాడు, వాటికి సాక్ష్యమవుతాడని అంటున్నారు. IPL 2022 ఫైనల్ మధ్య రిలీజ్ అయిన అమీర్ ఖాన్ , కరీనా కపూర్ నటించిన చద్దా ట్రైలర్, కుర్రాడైన అమీర్ ఖాన్ నడకలో ఇబ్బందులతోపాటు, మానసిక సవాళ్లతో బాధపడుతూ, వాటిని ఎలా అధిగమించి, ఎలా క్రాస్ కంట్రీ మారథాన్ తో ఎదిగాడో చూపిస్తుంది.
అమీర్ ఖాన్ మల్టీప్లెక్స్ చైన్స్ ముఖ్యంగా PVRతో ఒక డీల్ కుదుర్చుకున్నాడు. విడుదలైన మొదటి నాలుగు రోజులకు ఎక్కువ రేట్లతో అన్ని టిక్కెట్ ధరలను లాక్ చేయడానికి డీల్ కుదుర్చుకున్నాడని బాలీవుడ్ అంటోంది. ఈ లెక్కన RRR , KGF 2 లేదంటే మరే ఇతర బాలీవుడ్ సినిమాల రేట్లకన్నా లాల్ సింగ్ చద్దా రేట్లు ఎక్కువగా ఉండనున్నాయి. అమీర్ తన సినిమాను గట్టిగా లెక్కలేసి ఆగష్టు 11న రిలీజ్ చేస్తున్నాడు. అంటే 4-రోజుల తర్వాత ఆగస్ట్ 15న ఎలాగూ సెలవు. అంటే వారం మొత్తం సెలవుల మూడ్ లో ఉంటారు. హిట్ టాక్ వచ్చిందా? ఈ వారంలో ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ బాక్సీఫీస్ కలెక్షన్లను ఆమీర్ ఖాన్ దాటేయడం ఖాయం.
అమీర్ ఖాన్ ఇంకో లెక్క వేశాడు. ప్రైమ్‌టైమ్ షోలు, బెస్ట్ స్క్రీన్‌లను లాల్ సింగ్ చద్దా కోసం రిజర్వ్ చేయడానికి PVRతో ఒప్పందం కుదుర్చుకుంటున్నాడు. అంటే, ఒప్పందం ప్రకారం, పీవీఆర్ 8-10 రోజుల పాటు లాల్ సింగ్ చద్దా కోసమే ఈ ప్రైమ్ స్లాట్‌లన్నింటినీ ఇవ్వ నుంది. మరి అక్షయ్ కుమార్ నటించిన రక్షా బంధన్ సంగతేంటి? ఇది అదే రోజున విడుదల అవుతుంది. కాని మంచి స్క్రీన్స్ దొరికే అవకాశాలు తక్కువ ఉన్నాయి. మంచి ప్లానింగ్ ఉంటే ఎలా కాసుల వర్షం కురుస్తుందో ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ లు చూపించాయి. అందుకే ఆమీర్ ఖాన్ కూడా తన లాల్ సింగ్ చద్దా కోసం మంచి ప్లాన్ చేశాడు,