iDreamPost
android-app
ios-app

దేశంలో అత్యధిక ట్యాక్స్ పేయర్ హీరోయిన్స్ వీళ్లే

2023-24 ఆర్ధిక సంవ‌త్స‌రానికిగానూ అత్యధికంగా టాక్స్ చెల్లించే సెలబ్రిటీల జాబితాను తాజాగా విడుదల చేసింది ప్రముఖ మ్యాగజైన్ ఫార్చ్యూన్ ఇండియా. ఈ జాబితాలో హీరోలతో పాటు హీరోయిన్లు కూడా ఉన్నారు. వారెవరు అంటే..?

2023-24 ఆర్ధిక సంవ‌త్స‌రానికిగానూ అత్యధికంగా టాక్స్ చెల్లించే సెలబ్రిటీల జాబితాను తాజాగా విడుదల చేసింది ప్రముఖ మ్యాగజైన్ ఫార్చ్యూన్ ఇండియా. ఈ జాబితాలో హీరోలతో పాటు హీరోయిన్లు కూడా ఉన్నారు. వారెవరు అంటే..?

దేశంలో అత్యధిక ట్యాక్స్ పేయర్ హీరోయిన్స్ వీళ్లే

ప్రముఖ మ్యాగజైన్ ఫార్చ్యూన్ ఇండియా 2024లో అత్యధికంగా టాక్స్ చెల్లించే ఇండియన్ సెలబ్రిటీల జాబితాను విడుదల చేసింది. ఇందులో కింగ్ ఖాన్, బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ మొదటి స్థానంలో నిలిచాడు. 2023-24 ఆర్ధిక సంవ‌త్స‌రానికిగానూ రూ. 92 కోట్లు చెల్లించి హయ్యర్ టాక్స్ పేయర్‌గా నిలిచాడు. ఈ జాబితాలో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ రూ. 80 కోట్లతో రెండవ స్థానంలో ఉన్నాడు. ఇక మూడో స్థానంలో కండల వీరుడు సల్మాన్ నిలిచాడు. రూ. 75 కోట్లు ట్యాక్స్ చెల్లించాడట. అమితాబ్ బచ్చన్(రూ. 71 కోట్లు), విరాట్ కోహ్లీ (రూ. 66 కోట్లు), అజయ్ దేవగన్ (రూ. 42 కోట్లు), ఎమ్మెస్‌ ధోని (రూ. 38 కోట్లు), రణబీర్ కపూర్ (రూ. 36 కోట్లు), సచిన్ టెండూల్కర్ (రూ. 28 కోట్లు), హృతిక్ రోషన్ (రూ. 28 కోట్లు), కపిల్ శర్మ (రూ. 26 కోట్లు), సౌరవ్ గంగూలీ (రూ. 23 కోట్లు) ఉన్నారు.

ఇక హీరోయిన్ల విషయానికి వస్తే.. 2024లో భారతదేశంలో అత్యధికంగా పన్ను చెల్లించే మహిళా సెలబ్రిటీగా పేరు తెచ్చుకుంది బెబో అలియాస్ కరీనా కపూర్ ఖాన్. రూ.20 కోట్లు పన్నులు చెల్లించి అగ్రస్థానంలో నిలిచింది. టాలీవుడ్ అగ్రనటీమణులుగా చెలామణి అవుతున్న దీపికా పడుకొనే, అలియా భట్, అనుష్క శర్మలను వెనక్కు నెట్టింది. ఈ ముగ్గురు.. కియారాతో కలిసి రెండో స్థానం పంచుకున్నారు.  ఫార్చ్యూన్ ఇండియా ప్రకారం, రూ. 12 కోట్లు చెల్లించారు.  కియారా అద్వానీ తరువాతి స్థానంలో కత్రినా కైఫ్ ఉంది. రూ. 11 కోట్లు చెల్లించి మూడవ స్థానంలో నిలిచింది. సినిమా ఇండస్ట్రీలోకి కరీనా వచ్చి రెండు దశాబ్దాలకుపైనే అయింది. ఒకప్పుడు టాప్ హీరోయిన్లలో ఒకరు. ప్రస్తుతం కరీనా కపూర్ తన నెక్ట్స్ మూవీ బకింగ్‌హామ్ మర్డర్స్ సెప్టెంబర్ 13న రిలీజ్ కానుంది.

ఇక టాలీవుడ్ నుండి హయ్యెస్ట్ టాక్స్ పేయర్‌గా నిలిచాడు అల్లు అర్జున్. 2023-24 ఆర్ధిక సంవ‌త్స‌రానికిగానూ రూ. 14 కోట్లు చెల్లించాడు. అల్లు అర్జున్ కేవలం యాక్టింగ్ కాకుండా.. యాడ్స్‌, బ్రాండ్ ప్ర‌మోష‌న్స్ ద్వారా కోట్లు సంపాదిస్తున్నాడు. అలాగే ఆయనకు అనేక వ్యాపారాలు ఉన్నాయి. ప్రముఖ అమెరికన్ స్పోర్ట్స్ బార్ అండ్ రెస్టారెంట్ చైన్ అయిన బఫెలో వైల్డ్ వింగ్స్  ఫ్రాంచైజీ ఉంది. అలాగే ప్ర‌ముఖ‌ ఓటీటీ ప్లాట్‌ఫారమ్ ఆహాకు అల్లు అర్జున్ కో-ఫౌండ‌ర్‌గా ఉన్నాడు. అల్లు స్టూడియోస్, ఏఏఏ సినిమాస్ మల్టీ ప్లెక్స్ ద్వారా కూడా భారీగా సంపాదిస్తున్నాడు. ప్రస్తుతం అల్లువారి పిల్లగాడు.. పుష్ప 2లో బిజీగా ఉన్నాడు. ఈ ఏడాది డిసెంబర్ 6న ఈ మూవీ విడుదల కానుంది.