iDreamPost
iDreamPost
అమీర్ ఖాన్ సినిమా లాల్ సింగ్ చద్దా మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద 13 కోట్ల చాలా తక్కువ ఓపెనింగ్‌ను సాధించింది. పదేళ్లలో మూడు సినిమాలు మాత్రమే చేసిన అమీర్ ఖాన్ లాంటి స్టార్ కి, ఈ రేంజ్ ఓపెనింగ్స్ అంటే చాలా తక్కువ కిందే లెక్క. వెయ్యుకోట్లను సాధించగలదని లెక్కలువేస్తే 75 కోట్ల కలెక్షన్స్ మాత్రమే వస్తాయని ట్రేడ్ లెక్కవేస్తోంది. అందుకే ఈ డిజాస్టర్ తో అమీర్ షాక్‌లో ఉన్నాడని, నిర్మాతలకు పరిహారం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడని కొందరు అంటున్నారు.
లాల్ సింగ్ చద్దా విడుదలైనప్పటి భారీ నష్టం తప్పదని మొదటిరోజే బాలీవుడ్ లెక్కకు వచ్చింది. ఇది వీకెండ్ లో రిలీజ్ అయినా, 4 రోజుల్లో 50 కోట్లు కూడా రాబట్టలేకపోయింది. ఇక ఓపెనింగ్ అంటారా? లాల్ సింగ్ చద్దా మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద 13 కోట్లు మాత్రమే. ఈ నెంబర్లతో అమీర్ ఖాన్ షాక్‌లో ఉన్నాడని, నిర్మాతలకు పరిహారం చెల్లించడానికి సిద్ధంగా ఉన్నాడని నివేదికలు వస్తున్నాయి. కాని దీనిపై నిర్మాతలు అధికారికంగా స్పందించారు.
వయాకామ్ 18 సీఈవో అజిత్ చెప్పినదాని ప్రకారం, లాల్ సింగ్ చద్దాకు బైట నుంచి డిస్ట్రిబ్యూటర్లు లేరు. ఇది V18 స్టూడియోస్ ద్వారా రిలీజ్ అయ్యింది. ఇంకో సంగతి సంస్థ డబ్బు నష్టపోలేదు. ఈ సినిమా ఇప్పటికీ దేశంలో, అంతర్జాతీయంగా థియేటర్లలో నడుస్తోంది. ఓవర్ సీస్ లో లాల్ సింగ్ చద్దాకు మంచి కలెక్షన్స్ ఉన్నాయి. అమెరికాలో టాప్ 10 సినిమాల్లో ఇదొకూడా ఒకటి. ఎల్‌ఎస్‌సి బాక్సీఫీస్ కలెక్షన్స్ తో అమీర్ చాలా నిరాశపడ్డాడని చాలామంది అంటున్నా “ఫారెస్ట్ గంప్ కు ఉత్తమ వెర్షన్‌ను తీయడానికి అమీర్ చాలా కష్టపడ్డాడు. కాని జనం అతని సినిమాను చూడకపోవడం అతనిని తీవ్రంగా దెబ్బతీసిందని అన్నారు.
సినిమా రిలీజ్ కు ముందున్న ఉత్సాహం ఆ తర్వాత నీరుగారిపోయింది. అమీర్ ఖాన్ మీద పగబట్టినట్లుగానే, ట్రైలర్ రిలీజ్ నుంచి లాల్ సింగ్ చద్దాను బాయ్ కాట్ చేయమంటూ సోషల్ మీడియాలో భారీగా ప్రచారం జరిగింది. అమీర్ పీకె సినిమాతో హిందువుల మతపరమైన మనోభావాలను కించపరిచాడన్నది ప్రధాన అపవాదు. అదునుచూశారు. ట్రైలర్ రిలీజ్ తోనే సినిమా మీద పడ్డారు. తన సినిమాను బహిష్కరించవద్దని అమీర్ ఖాన్ కోరినా, ఆ విన్నపాన్ని కూడా ట్రోల్ చేశారు.
లాల్ సింగ్ చద్దా మొత్తంమీద 75 కోట్ల లైఫ్‌టైమ్ బిజినెస్ చేయగలదని బాలీవుడ్ సర్కిల్స్ అంటున్నారు. మేళా తర్వాత అమీర్ ఖాన్ చేసిన డిజాస్టర్ సినిమా సినిమా లాల్ సింగ్ చద్దా.