iDreamPost
android-app
ios-app

పీడీఎస్ బియ్యంపై కామారెడ్డి కలెక్టర్‌ను మంద‌లించిన‌ సీతారామన్, కలెక్టర్‌కు కేటీఆర్ స‌పోర్ట్

  • Published Sep 03, 2022 | 11:55 AM Updated Updated Sep 03, 2022 | 11:55 AM
పీడీఎస్ బియ్యంపై కామారెడ్డి కలెక్టర్‌ను మంద‌లించిన‌ సీతారామన్, కలెక్టర్‌కు కేటీఆర్ స‌పోర్ట్

జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్‌కు టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, తెలంగాణ మినిస్ట‌ర్ కేటీఆర్ మ‌ద్ద‌తుగా నిలిచారు. కామారెడ్డి జిల్లా కలెక్టర్‌తో కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ ప్రవర్తన తనను భయపెట్టిందని.
కష్టపడి పనిచేసే ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులను ఈ రాజకీయ నాయకులు నిరుత్సాహపరుస్తున్నారని ఆరోపించారు. శుక్రవారం కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తో జరిగిన సంభాషణలో కలెక్టర్ జితేష్ వి పాటిల్ గౌరవప్రదమైన ప్రవర్తనకు అభినందనలు తెలిపారు.


శుక్రవారం బీర్కూర్‌ మండల కేంద్రంలోని రేషన్‌ దుకాణం వద్ద లబ్ధిదా రులతో కేంద్ర మంత్రి నిర్మ‌లా మాట్లాడారు. ఎన్ని కిలోల బియ్యం ఇస్తున్నారు? ఎప్పుడు ఇస్తున్నారు? అడిగారు. రేషన్‌ బియ్యం పథకంలో కేంద్రం వాటా ఎంత? రాష్ట్రం వాటా ఎంత? లబ్ధిదారుల వాటా ఎంత? అని అక్క‌డే ఉన్న‌ కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి ప్రశ్నించారు. కేంద్రమంత్రి ప్రశ్నలకు కలెక్టర్‌ త తడబడ‌టంపై అసహనం వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలపై జిల్లా పాలనాధికారికి స్పష్టత లేకపోతే ఎలా? అని ప్రశ్నించారు. ‘నువ్వు ఐఏఎస్‌వేనా’ అంటూ ప్రశ్నించారు. ‘కేంద్రం ఎంత బియ్యం ఇస్తున్నదో కూడా తెలీదా..?’ అంటూ అనుచితంగా వ్యాఖ్యానించార‌ని తెరాస నేత‌లు విమ‌ర్శిస్తున్నారు. రేషన్‌ దుకాణంలో ప్రధాని మోదీ ఫొటో ఎందుకు పెట్టలేదని అడిగితే, మార్గదర్శకాల మేరకే తాము వ్యవహరిస్తున్నామని కలెక్టర్‌ జితేశ్‌ వీ పాటిల్‌ సమాధానం ఇచ్చారు.

కేంద్ర మంత్రి అక్క‌డితో ఆగ‌లేదు. రవాణా, గోడౌన్ ఖర్చులు కూడా భరించి కేంద్రమే బియ్యం సరఫరా చేస్తున్నందున, రేష‌న్ షాపు వ‌ద్ద‌ ప్రధాని మోడీ ఫ్లెక్సీ ఏర్పాటు చేయాల్సిందేనంటూ ఆమె ఆదేశించారు. అక్కడికి ఒక ఫ్లెక్సీ తెచ్చి పెట్టవలసిందిగా అప్పటికప్పుడు తమ పార్టీ నేత‌ల‌కు చెప్పారు. ఎవరూ దాన్ని చింప‌కుండా చూడవలసిన బాధ్యత కలెక్టర్‌దేనని చెప్పారు. మళ్ళీ ఇక్కడకు వస్తానని, అప్పటికి ప్రధాని నరేంద్ర మోడీ ఫ్లెక్స్ ఉండాలని ఆమె క‌లెక్ట‌ర్ కు తేల్చిచెప్పారు. ఈ మొత్తం వ్య‌వ‌హారంపై కేటీఆర్ ట్వీట్ చేశారు.