iDreamPost
android-app
ios-app

కృతిశెట్టికి స్పీడ్ బ్రేకర్ పడింది

  • Published Jul 19, 2022 | 3:23 PM Updated Updated Jul 19, 2022 | 3:23 PM
  • Published Jul 19, 2022 | 3:23 PMUpdated Jul 19, 2022 | 3:23 PM
కృతిశెట్టికి స్పీడ్ బ్రేకర్ పడింది

గత ఏడాది ఉప్పెనతో పరిచయమై డెబ్యూతోనే సూపర్ సక్సెస్ అందుకున్న కృతి శెట్టి తక్కువ టైంలోనే వరస ఆఫర్లతో దూసుకుపోయింది. ఆ తర్వాత వచ్చిన శ్యామ్ సింగ రాయ్ సక్సెస్ కావడం, నాగ చైతన్య జోడిగా చేసిన బంగార్రాజు హిట్టు కొట్టడం కెరీర్ ని హ్యాట్రిక్ తో మొదలుపెట్టాయి. దెబ్బకు కోటి దాకా రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నా నిర్మాతలు నో అనకుండా ఇచ్చేస్తున్నారట. అసలే టాలీవుడ్లో హీరోయిన్ల షార్టేజ్ ఉంది. పూజా హెగ్డే, రష్మిక మందన్నల పారితోషికాలకు భయపడే మీడియం ప్రొడ్యూసర్లు వాళ్ళ దగ్గరకు వెళ్లలేకపోతున్నారు. అలాంటి వాళ్లకు కృతి శెట్టికు కూడా అందదేమోననే స్థాయిలో డిమాండ్ బాగా పెరిగింది

కట్ చేస్తే ఇటీవలే రిలీజైన ది వారియర్ తనకు స్పీడ్ బ్రేకర్ అయ్యింది. రామ్ హీరోగా లింగుస్వామి దర్శకత్వంలో భారీ అంచనాలతో రూపొందిన ఈ కాప్ డ్రామాకు టాక్ తో పాటు వసూళ్లు కూడా ఏమంత ఆశాజనకంగా లేవు. డిజాస్టర్ తప్పదేమోనని ట్రేడ్ టాక్. రేడియో ఆర్జెగా చాలా చలాకీగా నటించి రామ్ తో పోటీ డాన్సులో ఆడిపాడిన కృతి శెట్టి ది వారియర్ ఫలితం మింగుడుపడనిదే. అందుకే రాబోయే వాటి మీదే తన ఫ్యాన్స్ ఆశలన్నీ. అందులో మొదటిది ఈ అమ్మాయి గురించి మీకు చెప్పాలి. ఇంద్రగంటి మోహనకృష్ణ డైరెక్షన్ లో రూపొందిన ఈ రొమాంటిక్ డ్రామా విడుదలకు రెడీ అవుతోంది. వాయిదాలు పడ్డాయి కానీ ఫైనల్ గా సెప్టెంబర్ లో రావొచ్చు.

దీనికన్నా ముందు ఆగస్ట్ 12న నితిన్ మాచర్ల నియోజకవర్గం వస్తుంది. అదీ కమర్షియల్ సినిమానే కానీ కాన్సెప్ట్ ఏదో కొంత డిఫరెంట్ గా కనిపిస్తోంది. ఇది వర్కౌట్ అయితే వారియర్ తాలూకు గాయం మానిపోతుంది. తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు నాగచైతన్య కాంబోలో రూపొందుతున్న మూవీలోనూ కృతినే హీరోయిన్. శివపుత్రుడు కాంబో బాలా-సూర్యల ప్రాజెక్టునీ పట్టేసింది. మొత్తానికి నాలుగు సినిమాలు చేతిలో ఉన్నాయి. మరికొన్ని ఫైనల్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. ఫ్లాపులొచ్చి హిట్లొస్తే ఆనందం కానీ మంచి సక్సెస్ ల మీదున్నప్పుడు ఏదైనా తేడా కొడితే ఇబ్బందే. అయినా ఇప్పటికిప్పుడు ఒక సినిమా వల్ల కీర్తికు వచ్చే డ్యామేజ్ ఏదీ లేదు

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş