iDreamPost
నటుడిగా, నిర్మాతగా, రాజకీయ నాయకుడు ఇలా వివిధ రంగాల్లో తన ప్రతిభను చాటిన లెజెండ్ కు కొన్ని తీరని కోరికలు మిగిలిపోయాయి. భక్త కన్నప్పను భారీ బడ్జెట్ తో ప్యాన్ ఇండియా లెవెల్ లో రీమేక్ చేయాలన్నది అందులో మొదటిది.
నటుడిగా, నిర్మాతగా, రాజకీయ నాయకుడు ఇలా వివిధ రంగాల్లో తన ప్రతిభను చాటిన లెజెండ్ కు కొన్ని తీరని కోరికలు మిగిలిపోయాయి. భక్త కన్నప్పను భారీ బడ్జెట్ తో ప్యాన్ ఇండియా లెవెల్ లో రీమేక్ చేయాలన్నది అందులో మొదటిది.
iDreamPost
రెబెల్ స్టార్ గా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థానం సంపాదించుకున్న కృష్ణంరాజు గారు ఇవాళ అభిమానులకు శ్రేయోభిలాషులకు మధ్యాహ్నం అంత్యక్రియల ఘట్టంతో సెలవు తీసుకోబోతున్నారు. పేరుకి ప్రభాస్ తమ్ముడి కొడుకనే కానీ స్వంత బిడ్డ కంటే ఎక్కువగా వారసుడని చెప్పుకుని గర్వపడేవారు. నటుడిగా, నిర్మాతగా, రాజకీయ నాయకుడు ఇలా వివిధ రంగాల్లో తన ప్రతిభను చాటిన లెజెండ్ కు కొన్ని తీరని కోరికలు మిగిలిపోయాయి. భక్త కన్నప్పను భారీ బడ్జెట్ తో ప్యాన్ ఇండియా లెవెల్ లో రీమేక్ చేయాలన్నది అందులో మొదటిది. ప్రభాస్ తో కుదరకపోతే ఇంకెవరితో అయినా సరే ల్యాండ్ మార్క్ మూవీగా తీయాలని చాలాసార్లు చెప్పారు
ఛత్రపతిలో ఫేమస్ డైలాగ్ ఒక్క అడుగుని టైటిల్ గా పెట్టి ఓ స్క్రిప్ట్ సిద్ధం చేయించారు. కానీ ప్రభాస్ కున్న కమిట్మెంట్లు, ఇంటర్నేషనల్ లెవెల్ లో పెరిగిన మార్కెట్ దృష్ట్యా దానికి కొన్ని మార్పులు అవసరం కావడంతో అదీ వాయిదా పడుతూ వచ్చింది. తనకిష్టమైన విశాల నేత్రాలు నవలను తెరకెక్కించాలని కృష్ణంరాజుగారు ప్రయత్నించారు. కానీ సరైన క్యాస్టింగ్, దర్శకుడు సెట్ కాక అది మరుగున పడిపోయింది. చిరంజీవి కెరీర్ ప్రారంభంలో తనతో కలిసి నటించిన మన ఊరి పాండవులను ఇప్పటి ట్రెండ్ కు అనుగుణంగా రంగస్థలం తరహా బ్యాక్ డ్రాప్ లో మల్టీ స్టారర్ గా తీయాలని ప్లాన్ చేసుకున్నారు. అది సైతం పలు అడ్డంకులను దాటి వెళ్లలేకపోయింది.
వయసుకు తోడు అనారోగ్య సమస్యల వల్ల కృష్ణంరాజు గారు వీటి పట్ల చురుగ్గా కదల్లేకపోయారు. ప్రభాస్ పెళ్లి చేసుకున్నాక అతని పిల్లలతో ఆడుకోవాలని పలు సందర్భాల్లో ఆయన చెప్పడం అభిమానులకు గుర్తే. సంబంధాలు చూస్తున్న క్రమంలోనే ఇలా జరిగిపోయింది. ఆది పురుష్ ఇండియన్ సినిమాలో గొప్ప మైలురాయి అవుతుందని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న తరుణంలో దాన్ని చూడకుండానే కన్నుమూయడం ఇంకా బాధాకరం. ఏది ఏమైనా గొప్ప నటుడి ప్రస్థానం ముగిసిపోయింది. ఎనిమిది వసంతాల సంపూర్ణ జీవితాన్ని అనుభవించి వివాదరహితుడిగా వెళ్లిపోతున్న రెబెల్ స్టార్ భౌతికంగా లేకపోవచ్చు కానీ సినిమా చరిత్రలో ఆయనదో సువర్ణాధ్యాయం