iDreamPost
android-app
ios-app

ఉపాసన బిడ్డకి ఉయ్యాల రెడీ.. ఎవరు తయారు చేశారంటే..?

  • Published Jun 17, 2023 | 6:55 PM Updated Updated Jun 17, 2023 | 6:55 PM
  • Published Jun 17, 2023 | 6:55 PMUpdated Jun 17, 2023 | 6:55 PM
ఉపాసన బిడ్డకి ఉయ్యాల రెడీ.. ఎవరు తయారు చేశారంటే..?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మెగాస్టార్ వారసుడిగా ఇండస్ట్రీలోకి  ఎంట్రీ ఇచ్చి.. తనదైన నటనతో స్టార్ హీరోగా మారారు. పదేళ్ల క్రితం రామ్ చరణ్ కు , ఉపాసనతో వివాహం జరిగింది. ఇన్నేళ్ల తరువాత  ఆ దంపతులు తల్లిదండ్రులు కాబోతున్నట్లు చెప్పి.. ఫ్యాన్స్ తో పాటు అందరిని సంతోష పెట్టారు. తమ అభిమాన హీరో  తండ్రి కాబోతున్నాడనే విషయం తెలిసిన దగ్గర నుంచి మెగా అభిమానుల్లో పండుగా వాతావరణం నెలకుంది. ఇక ఈ విషయం తెలిసిన కొందరు సెలబ్రిటీలు ఉపాసనకు బహుమతలు పంపిస్తూ విషెష్ చెప్పారు. ఇటీవలే అలియా భట్.. ఉపాసనకు ఒక బహుమతి పంపించింది.

తాజాగా ప్రజ్వల ఫౌండేషన్ వాళ్ళు ఉపాసనకు పుట్టబోయే బిడ్డ కోసం ఒక ఉయ్యాలను బహుమతిగా పంపించారు.  వారు పంపిన బహుమతి  విషయాన్ని తెలియజేస్తూ ఉపాసన.. సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. అయితే ఈ ఉయ్యాలను ఎవరు తయారు చేశారనే విషయం తెలుసుకునేందుకు మెగా అభిమానులు తెగ సెర్చ్ చేస్తున్నారు. ఇంతకి ఆ  ఉయ్యాలను తయారు చేసింది ఎవరో తెలిస్తే మీరు షాకవాల్సిందే. ఫౌండేషన్ లోని కొంతమంది యువతులు ఆ ఉయ్యాలను తయారు చేశారు. వారంతా హ్యూమన్ ట్రాఫికింగ్ నుంచి బయటపడిన యువతులే.   ఆ నరక కూపం నుంచి బయటపడిన వారు ప్రస్తుతం ప్రజ్వల ఫౌండేషన్ లో ఉంటున్నారు. వారంతా కలసి ఉపాసన బిడ్డకి ఉయ్యాల రెడీ చేసి గిఫ్ట్ గా పంపించారు.

ప్రస్తుతం ఉపాసన చేసిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది. ఈ ఫోటోను చూసి మెగా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమ బుల్లి మెగాస్టార్ ఆ ఉయ్యలలోనే ఊగనున్నాడంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే, ఉపాసన ఇటీవల ఒక నేషనల్ మీడియాకి ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఇక తమకి పుట్టబోయే బిడ్డని చిరంజీవి దగ్గరే పెంచనున్నట్లు ఉపాసన చెప్పుకొచ్చింది. బిడ్డ పుట్టిన తరువాత అత్తమామల వద్దకే వెళ్లాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. మరి.. ఉపాసనకు వచ్చిన బహుమతిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela)

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibombetciograndpashabet