iDreamPost
android-app
ios-app

Koffee With Karan 7: మలైకా అరోరాతో అర్జున్ కపూర్ పెళ్లికి ఎందుకు రెడీగా లేడు? మ‌లైకా కొడుకు గురించి ఎందుకు అలోచిస్తున్నాడు?

  • Published Aug 11, 2022 | 1:03 PM Updated Updated Aug 11, 2022 | 1:03 PM
  • Published Aug 11, 2022 | 1:03 PMUpdated Aug 11, 2022 | 1:03 PM
Koffee With Karan 7: మలైకా అరోరాతో అర్జున్ కపూర్ పెళ్లికి ఎందుకు రెడీగా లేడు? మ‌లైకా కొడుకు గురించి ఎందుకు అలోచిస్తున్నాడు?

మలైకా అరోరాతో డేటింగ్ లో ఉన్నా. అలాగ‌ని త్వరలో పెళ్లికూడా చేసుకోను. ఆమెతో డేటింగ్ చేసే ముందు, ఆమె కొడుకు అర్హాన్ గురించి ఎందుకు? ఎలా ఆలోచించాడో కూడా క‌ర‌ణ్ జోహార్ షోలో బైట‌పెట్టాడు అర్జున్ కపూర్. క‌ర‌ణ్ షోలో ఈ ఎపిసోడ్, ప‌రిణితి చెందిన బాలీవుడ్ హీరోను ప్ర‌జెంట్ చేసింది.

అర్జున్ కపూర్ మీడియాతో మాట్లాడిన‌ప్పుడు నిజాయితీగా మాట్లాడ‌తాడు. మిగిలిన సెల‌బ్రిటీల్లా తెచ్చిపెట్టుకున్న మాట‌ల‌ను చిల‌క‌లా అప్ప‌ చెప్ప‌డు. మ‌న‌సులో ఉన్న‌ది ధైర్యంగా బైట‌కు చెబుతాడు. తాజాగా అత‌ని సినిమా ఏక్ విలన్ రిటర్న్స్(ek villain returns) రిలీజ్ అయ్యింది. సినిమాలో నెగిటీవ్ షేడ్స్ ఉన్నా, నిజ‌జీవితంలో మాత్రం పాజిటీవ్ గానే ఉండాల‌నుకొనే న‌టుడు అర్జున్ క‌పూర్. కరణ్ జోహార్ షో, కాఫీ విత్ కరణ్ 7(Koffee With Karan 7) లో సిస్ట‌ర్ సోనమ్ కపూర్‌తో కలిసి వ‌చ్చాడు. త‌న‌ వ్యక్తిగత జీవితం నుంచి వృత్తి జీవితం వరకు చాలా విషయాల గురించి మాట్లాడాడు. మలైకాతో డేటింగ్ చేయ‌డానికి ముందు ఆమె కొడుకు అర్హాన్ ఖాన్ గురించి ఎలా ఆలోచించాడో కూడా చెప్పాడు. ముక్క‌చెక్క‌లైన కుటుంబం నుంచి వ‌చ్చాను. అందువ‌ల్లే అర్హాన్ గురించి కూడా, త‌న‌లాగే ఆలోచించాన‌ని అన్నాడు. మలైకాను ప్రేమిస్తున్నాను. కాని ఆమెకు కొడుకు ఉన్నందున, పెళ్లికోసం ముందుకెళ్ల‌లేన‌ని అన్నాడు. ఆమెకు కుటుంబం, కొడుకు ఉన్నారు. వాళ్ల‌నుకూడా నేను గౌర‌విస్తాన‌ని అన్నాడు.

నేను ఒక అయోమయ పరిస్థితిలో, ముక్క‌లైన కుటుంబంలో పెరిగాను, ఇలాంటి ప‌రిస్థితుల్లో కొడుకుగా ఉండటం సులువేంకాదు. చుట్టూ ఉన్న‌దాన్ని అర్ధంచేసుకోవాలి. ఒప్పుకోవాలి. కాబట్టి, మన చుట్టూ ఉన్న మ‌న కుటుంబాన్ని బాధ‌పెట్ట‌కుండా ఎలా వ్య‌వ‌హారించాల‌న్న‌దానిపై నాకో ఆలోచ‌న ఉంది. అందుకే పెళ్లికోసం ఆమెను ప్ర‌పోజ్ చేయ‌లేన‌ని అర్జున్ క‌పూర్ అన్నాడు.

అర్జున్ ఇప్పుడు పెళ్లికి ఎందుకు సిద్ధంగా లేడనే విషయాన్ని కూడా బయటపెట్టాడు. మలైకాతో తన పెళ్లి గురించి మాట్లాడుతూ, ముందు తన వృత్తి జీవితంలో, ఆర్థికంగానే కాకుండా, మానసికంగాకూడా స్థిరపడాలని కోరుకుంటున్నట్లు చెప్పాడు. తన కెరీర్‌లో సెటిల్ అయితే మరింత ఆనందాన్ని ఇస్తుంది. మీరు సంతోషంగా లేకుంటే, మీ పార్ట‌న‌ర్ ని ఎలా సంతోషంగా ఉంచ‌గ‌ల‌ర‌ని అన్నాడు.

అర్జున్ అటు ప‌ర్స‌న‌ల్ లైఫ్ లో, ఇటు ప్రొఫెష‌న‌ల్ లైఫ్ లో చాలా ముందుకు వచ్చాడు. ప‌రిణితి ఉన్న న‌టుడిగా బాలీవుడ్ లో మంచిపేరుంది. ఇప్పుడిప్పుడే కుటుంబాన్ని ఏకం చేస్తున్నాడు. సిస్ట‌ర్ జాన్వీ కపూర్ ను ద‌గ్గ‌ర‌కు తీసుకున్నాడు. అన్న‌గా బాధ్య‌త తీసుకొంటున్నాడు. మలైకాతో అనుబంధాన్ని ప‌టిష్టం చేసుకొంటున్నాడు. అందుకే ఈ ఎపిసోడ్ మొత్తం సీజ‌న్ లోనే భావోద్వేగ ప్ర‌యాణంలా సాగింది.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetCasinolevantCasinolevantholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetCasibomgrandpashabetJojobet Girişbigboss