Idream media
Idream media
సంక్రాతి పండగ వచ్చిందంటే చాలు ఆంధ్రప్రదేశ్ పల్లెల్లో సందడి వాతావరణం నెలకొంటుంటుంది. ఆట పాటలతో మూడు రోజుల పాటు యువత, పెద్దలు సంతోషంగా గడుపుతారు. క్రికెట్, సాంప్రదాయ గ్రామీణ క్రీడా పోటీలు జరుగుతాయి. ఐతే సంక్రాతి అంటే యావత్ ఆంధ్రప్రదేశ్ ఉభయ గోదావరి జిల్లాల వైపు చూస్తుంది. ఇక్కడ జరిగే కోడి పందేల కోసం రాష్ట్రము నలుమూలల నుంచి, హైద్రాబాద్ నుంచి కూడా పందెం రాయుళ్లు వస్తారు. రాజకీయ నేతలు, వ్యాపారాలు అందరూ పందెంలో పాల్గొంటారు. రాజకీయ నేతలే స్వయంగా బరులను నిర్వహిస్తారు. కోడిపందేల పై నిషేధం ఉన్నా ఎప్పటిలాగే యధావిధిగా పందేలు నడుస్తాయి.
ఐతే ఈ సారి ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం మారడం, అసాంఘిక కార్యక్రమాలపై జగన్ సర్కార్ ఉక్కుపాదం మోపుతుండడంతో పందేల పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. పందేలు జరుగుతాయా..? లేదా..? అన్న సందేహాలు నెలకొన్నాయి. తాజగా గా తూర్పుగోదావరి జిల్లా తాళ్లరేవు మండలం సీతారాంపురంలో కోడి పందేలకు ఉపయోగించే కత్తులు తయారు చేస్తున్న కార్ఖానాపై పోలీసులు దాడి చేశారు. 3982 కత్తులను స్వాధీనం చేసుకున్నారు.వీటి విలువ రూ.12 లక్షలు ఉంటుంది. తయారీ దారులను అరెస్ట్ చేశారు.
తూర్పు గోదావరి జిల్లా నుంచే రాష్ట్రంలో ఇతర ప్రాంత్రాలకు కోడి కత్తుల సరఫరా జరుగుతుంది. పశ్చిమ గోదావరి, కృష్ణ జిల్లాలకు ఇక్కడ నుంచి కత్తుల సరఫరా నడుస్తోంది. పందెంలో కత్తులదే ముఖ్య పాత్ర. ఇవి అన్ని చోట్ల లభ్యం కావు. వీటి తయారీ ప్రతి ఏడాది జరుగుతున్నదే. పోలీసులకు ఈ విషయం తెలుసు. కానీ ఈ ఏడాది తయారీ కేంద్రాలపై దాడులు చేసి, అరెస్టులు చేయడం తో పందేల నిర్వహణ పై పందెం రాయుళ్ల లో సర్వత్రా ఆసక్తి నెలకొంది.