భారత చిరుతకు శిక్షణ ఇప్పిస్తాం… కేంద్ర మంత్రి

  • Published - 10:53 AM, Sat - 15 February 20
భారత చిరుతకు శిక్షణ ఇప్పిస్తాం… కేంద్ర మంత్రి

ఉసేన్ బోల్ట్ ని మించిన వేగంతో పరిగెత్తి అనూహ్యంగా వెలుగులోకి వచ్చిన శ్రీనివాస గౌడపై ప్రశంసల వర్షం కురుస్తుంది.. దానితో పాటుగా కేంద్ర మంత్రి దృష్టిలో పడ్డాడు శ్రీనివాస గౌడ..

శ్రీనివాస గౌడ తన కోడెలతో చిరుత వేగంతో పరిగెత్తిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అతనికి శిక్షణ ఇప్పించి ఒలంపిక్స్ కి పంపాలని పలువురు సెలెబ్రిటీలు వ్యాఖ్యానిస్తున్నారు. తాజాగా ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా కూడా స్పందించారు.. స్పందించడమే కాకుండా శ్రీనివాస గౌడ గురించి కేంద్ర మంత్రి కిరెన్ రిజిజు దృష్టికి తీసుకెళ్లారు.

Read Also: ఉసేన్ బోల్ట్ రికార్డును భారతీయుడు బద్దలు కొట్టాడా?

అతని శరీర ధారుఢ్యాన్ని చూస్తే అథ్లెటిక్స్ లో అసాధారణ విజయాలు సాధించే సామర్ధ్యం ఉందని తెలుస్తుంది. అతనికి 100 మీటర్ల స్ప్రింట్ లో శిక్షణ ఇప్పించేలా కిరెన్ రిజిజు చూడాలి. లేదా కంబళ క్రీడను ఒలింపిక్స్ లో చేర్చేలా కృషి చేయాలి. అతని ప్రదర్శనకు ముందుగా బంగారు పతకం ఇవ్వాలని ట్వీట్ చేశారు.

ఆనంద్ మహీంద్రా ట్వీట్ కి స్పందించిన కేంద్ర మంత్రి కిరెన్ రిజిజు దేశంలో ప్రతిభగల వ్యక్తులను ఎన్నటికీ వదులుకోమని పేర్కొన్నారు.. శ్రీనివాస గౌడను శాయ్ కి పిలిపిస్తామని హామీ ఇచ్చారు. అథ్లెటిక్స్ కి సంబంధించి ఒలింపిక్స్ ప్రమాణాలపై చాలామందికి అవగాహనా ఉండదని, దానికి శారీరక దృఢత్వం, ఓర్పు ఎంతో అవసరమని తెలిపారు. శ్రీనివాసగౌడను ట్రయల్స్ కోసం కోచ్ ల దగ్గరకు పంపిస్తామని తెలిపారు.. అతని ప్రయాణానికి రైలు టికెట్లను ఇప్పటికే పంపామని జాతీయ స్థాయి ఉత్తమ కోచ్ ల పర్యవేక్షణలో అతడిని అత్యుత్తమ క్రీడాకారుడిగా తీర్చిదిద్దుతామని కిరెన్ రిజిజు పేర్కొన్నారు.. 

దీంతో అథ్లెటిక్స్ లో భారత దేశానికి పతకాల పంట పండించే మట్టిలో మాణిక్యాన్ని సోషల్ మీడియా ద్వారా వెలికితీశారని ప్రశంశల వర్షం కురుస్తుంది.. సరైన శిక్షణ దొరికితే శ్రీనివాస గౌడ దేశ కీర్తి ప్రతిష్టలను పెంపొందింస్తాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు..

Show comments