iDreamPost
android-app
ios-app

కుర్ర హీరో మాస్ టార్గెట్

  • Published Sep 15, 2022 | 4:31 PM Updated Updated Dec 08, 2023 | 1:23 PM

టీమ్ గత వారం నుంచి ఎడతెరిపి లేకుండా ప్రమోషన్లు చేస్తూనే ఉంది.

టీమ్ గత వారం నుంచి ఎడతెరిపి లేకుండా ప్రమోషన్లు చేస్తూనే ఉంది.

  • Published Sep 15, 2022 | 4:31 PMUpdated Dec 08, 2023 | 1:23 PM
కుర్ర హీరో మాస్ టార్గెట్

రేపు విడుదల కాబోతున్న సినిమాల్లో కిరణ్ అబ్బవరం నేను మీకు బాగా కావాల్సినవాడిని మీద యూత్ లో ఓ మోస్తరు అంచనాలున్నాయి. టీమ్ గత వారం నుంచి ఎడతెరిపి లేకుండా ప్రమోషన్లు చేస్తూనే ఉంది. నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా గట్టిగానే చేశారు. మాస్ ని ఆకట్టుకునే అంశాలు పుష్కలంగా ఉన్నాయని, దాంతో పాటు తండ్రి కూతుళ్ళ ఎమోషన్ ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు. సుప్రసిద్ధ దర్శకుడు కోడి రామకృష్ణ కూతురు దివ్య మొదటిసారి తమ సంస్థలో నిర్మించిన మొదటి చిత్రమిది. మణిశర్మ సంగీతం సమకూర్చగా ఎస్ఆర్ కళ్యాణ మండపంతో డెబ్యూ హిట్ కొట్టిన దర్శకుడు శ్రీధర్ గాదె దీనికి కెప్టెన్.

కిరణ్ కు ఇది పెద్ద హిట్ కావడం చాలా అవసరం. రాజావారు రాణిగారు మంచి పేరైతే తెచ్చింది థియేట్రికల్ గా అంతగా వర్కౌట్ చేయలేకపోయింది. చాలా తక్కువ బడ్జెట్ కావడంతో నిర్మాతలు ఓటిటి, డిజిటల్ తదితర రూపాల్లో సేఫ్ అయ్యారు. ఎస్ఆర్ కళ్యాణ మండపం అనూహ్య విజయం సాధించాకే కిరణ్ అబ్బవరం అనే పేరు ఇండస్ట్రీకి తెలిసింది. కట్ చేస్తే సెబాస్టియన్ ఇచ్చిన షాక్ మామూలుది కాదు. మరీ దారుణంగా దెబ్బ తింది. సమ్మతమే సైతం మొదటి రెండు మూడు రోజులు యూత్ సపోర్ట్ తో లాకొచ్చినా కంటెంట్ ల్యాగ్ వల్ల ఆశించిన స్థాయికి వెళ్ళలేదు. అందుకే హోప్స్ అన్నీ నేను మీకు కావాల్సిన వాడిని మీదే ఉన్నాయి.
kiran abbavaram
కెరీర్ ప్రారంభంతో పోల్చుకుంటే కిరణ్ మార్కెట్ ప్లస్ బడ్జెట్ రెండూ పెరిగాయి. రెండు మూడు కోట్ల దాకా సేఫ్ గేమ్ అనుకునే రేంజ్ నుంచి ఇప్పుడు పది కోట్లు దాటే స్థాయికి చేరుకున్నాడు. ఇంకో పెద్ద బ్రేక్ దక్కితే చక్కగా మీడియం రేంజ్ లీగ్ లో సెటిల్ కావొచ్చు. కొంత భాగం అయ్యాక కావాల్సినవాడికి దర్శకుడు మారడం ఎంత వరకు ప్లస్ అయ్యిందో సినిమా చూశాక క్లారిటీ వస్తుంది. కిరణ్ కు నెక్స్ట్ రిలీజ్ కు రెడీగా ఉన్న మూవీ వినరో భాగ్యము విష్ణు కథ. తర్వాత వరసలో మీటర్, రూల్స్ రంజన్, మరో రెండు ప్రాజెక్టులు సెట్స్ మీదున్నాయి. ఇవన్నీ ఓకే కానీ కావాల్సినవాడి అడ్వాన్స్ బుకింగ్స్ మాత్రం వీక్ గా ఉన్నాయి. రేపు పబ్లిక్ టాక్ చాలా కీలకం కానుంది

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss