Idream media
Idream media
మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ ఘనవిజయం సాధించారు. నాగ్‌పూర్ సౌత్ వెస్ట్ శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీచేసిన ఫడ్నవీస్ కాంగ్రెస్ అభ్యర్థి ఆశీశ్ దేశ్‌ముఖ్‌పై గెలుపొందారు. హరియాణా సీఎం మనహర్‌లాల్ ఖట్టర్ కర్నాల్ శాసనసభ నియోజకవర్గంలో విజయం సాధించారు. అయితే హరియాణాలో ఎన్నికల ఫలితాల్లో ప్రధాన పార్టీల మధ్య హోరాహోరీ పోరు కొనసాగుతోంది. ఇప్పటివరకు ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాలేదు. ప్రస్తుతం హరియాణా కింగ్ మేకర్, జననాయక్ జనతా పార్టీ అధినేత దుష్యంత్ చౌతాలా ఘనవిజయం సాధించారు. ఉచానా కలాన్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీచేసిన ఆయన బీజేపీ అభ్యర్థి ప్రేమ్ లతపై గెలుపొందారు.