iDreamPost
android-app
ios-app

కింగ్‌ నాగార్జున కూడా అది ‘ట్రై’ చేస్తున్నాడా.?

కింగ్‌ నాగార్జున కూడా అది ‘ట్రై’ చేస్తున్నాడా.?

ఓ వైపు బిగ్‌ బాస్‌ రియాల్టీ షోకి హోస్ట్‌గా వ్యవహరించడం, ఇంకో వైపు ‘వైల్డ్‌ డాగ్‌’ సినిమా షూటింగ్‌లో పాల్గొనడం.. ఇవే కాకుండా కింగ్‌ అక్కినేని నాగార్జున మరో ఇంట్రెస్టింగ్‌ టాస్క్‌కీ లైన్‌ క్లియర్‌ ఇచ్చేసినట్లు తెలుస్తోంది. ఓ టాలెంటెడ్‌ యంగ్‌ గై తీసుకొచ్చిన కాన్సెప్ట్‌ నచ్చడంతో కింగ్‌ నాగ్‌ ఓ షార్ట్‌ ఫిలిం చేయాలనుకుంటున్నారట. అదే నిజమైతే, అతి త్వరలోనే కింగ్‌ నాగ్‌ని షార్ట్‌ ఫిలింలో డిజిటల్‌ ప్లాట్‌ఫాంపై మనం చూడొచ్చన్నమాట. కింగ్‌ నాగ్‌ ఎప్పుడూ ప్రయోగాల విషయంలో అందరికంటే ముందుంటాడు. ఇది అందరికీ తెలిసిన విషయమే. అదే సమయంలో యంగ్‌ టాలెంట్‌ని ప్రోత్సహించడంలో నాగ్‌ తర్వాతే ఎవరైనా. సమయాన్ని సద్వినియోగం చేసుకోవడమెలాగో కూడా నాగ్‌కి బాగా తెలుసు. అయితే, షార్ట్‌ ఫిలిం విషయంలో మాత్రం ఇంకాస్త స్పష్టత రావాల్సి వుందట. అది షార్ట్‌ ఫిలిం అవుతుందా.? వెబ్‌ సిరీస్‌ అవుతుందా.? అన్నదానిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి సినీ వర్గాల్లో. కరోనా నేపథ్యంలో ఈ షార్ట్‌ ఫిలింస్‌, వెబ్‌ సిరీస్‌ల జోరు బాగా పెరిగింది. పెద్ద పెద్ద తారలూ ఓటీటీ కంటెంట్‌ కోసం తమవంతుగా కష్టపడుతున్నారు. రెమ్యునరేషన్‌ ఆలోచనలు మాత్రమే కాకుండా, ఏదో కొత్తగా చేశాం.. అన్న ఫీలింగ్‌ కోసం స్టార్లు ఓటీటీ వైపు చూస్తున్నారు. మరి, నాగ్‌ విషయంలో ఏం జరుగుతుందో.! అసలు అంత సమయం నాగ్‌ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఓ వెబ్‌ సిరీస్‌కి కేటాయించగలడా.? ఈ గాసిప్స్‌లో నిజమెంత.? కొన్నాళ్ళు వేచి చూస్తే పోలా!