iDreamPost
android-app
ios-app

మిస్టరీగా మారిన నర్సింగ్‌ విద్యార్థిని కావ్య ఆత్మహత్య.. అసలేం జరిగింది?

  • Published Jun 22, 2023 | 12:28 PM Updated Updated Jun 22, 2023 | 12:28 PM
  • Published Jun 22, 2023 | 12:28 PMUpdated Jun 22, 2023 | 12:28 PM
మిస్టరీగా మారిన నర్సింగ్‌ విద్యార్థిని కావ్య ఆత్మహత్య.. అసలేం జరిగింది?

ఆ తల్లిదండ్రులు తమ బిడ్డ చక్కగా చదవుకుని జీవితంలో ఉ‍న్నత స్థానాలకు చేరుకోవాలని కలలు కన్నారు. తన కాళ్ల మీద తాను నిలబడితే చాలు అనుకున్నారు. బిడ్డను బాగా చదించారు. ఇష్టమైన కోర్సులో చేర్పించారు. మరి కొన్ని రోజుల్లో చదువు పూర్తి చేసుకుని.. ఉద్యోగం చేస్తుందని భావించిన తల్లిదండ్రులు.. పిడుగులాంటి వార్త విని కుప్పకూలారు. అల్లారుముద్దుగా పెంచుకున్న కుమార్తె.. ఆత్మహత్యకు పాల్పడిందని తెలిసి.. వారి గుండె ఆగిపోయింది. చిన్నప్పటి నుంచి కష్టమంటే ఏంటో తెలియకుండ పెంచుకున్న బిడ్డ.. ఇంత కఠిన నిర్ణయం తీసుకుంటుందని వారు ఊహించలేదు. అసలు తమ బిడ్డకు ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దాంత ఈ ఆత్మహత్య కేసు మిస్టరీగా మారింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంతకు ఏం జరిగింది.. అంటే..

ఖమ్మంలో జిల్లాలో ఓ నర్సింగ్‌ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. ఈ విషాద ఘటన బుధవారం (జూన్‌ 21) జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం మద్దుకూరుకు చెందిన కోడెం కృష్ణ, రమాదేవి దంపతులకు ఇద్దరు కుమార్తెలు సంతానం.వీరిలో చిన్న కుమార్తె తె కావ్య(19) ఖమ్మంలోని పారా మెడికల్‌ కాలేజీలో నర్సింగ్‌ (ఏఎన్‌ఎం) చదువుతోంది. ఈ క్రమంలో కావ్య తల్లిదండ్రులకు దూరంగా.. బీకే బజార్‌లోని ఆసుపత్రిలో నర్స్‌గా పనిచేస్తోన్న స్నేహితురాలైన సీతామహాలక్ష్మితో కలిసి ఓ అద్దె గదిలో ఉంటోంది. ఈ క్రమంలో మంగళవారం రాత్రి విధులు ముగించుకుని వచ్చిన కావ్య నిద్రపోయింది. బుధవారం ఉదయం కావ్య గదిలో నిద్రపోతుండగా.. స్నేహితురాలు సీతామహాలక్ష్మి విధులకు వెళ్లింది.

సీతామహాలక్ష్మి వెళ్లిన కాసేపటికి.. కావ్య మరో స్నేహితురాలైన తనుశ్రీ ఆమె ఉంటున్న గదికి వచ్చి కాసేపు మాట్లాడి తిరిగి కిందకు వెళ్లేందుకు బయటకు వచ్చింది. తనుశ్రీ కిందకు వస్తుండగానే.. పెద్ద శబ్దం వినిపించింది. ఏం జరిగిందా అని కావ్య గదికి వెళ్లిన తనుశ్రీ అక్కడ తన ఎదురుగా కనిపించిన దృశ్యం చూసి షాకయ్యింది. గదిలో కావ్య ఉరి వేసుకుని కనిపించింది. వెంటనే చుట్టుపక్కల వారిని పిలవడంతో వారు వెంటనే స్పందించి.. కావ్య గదికి వచ్చి ఆమెను కిందకు దించారు. కానీ అప్పటికే కావ్య మృతి చెందినట్లు గ్రహించారు. తాను మాట్లాడినప్పుడు కావ్య నీరసంగా ఉన్నట్లు తనుశ్రీ తెలిపింది.

ఆత్మహత్య చేసుకోవాడానికి ముందు.. కావ్య తనకు ఫోన్‌ చేసి జాగ్రత్తలు చెప్పినట్లు ఆమె తల్లి రమాదేవి వెల్లడించింది. అంతేకాక తన కూతురు ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని, ఇందుకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని కోరుతూ తల్లి రమాదేశి ఖమ్మం వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కావ్య ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet