iDreamPost
iDreamPost
ఒక్కోసారి మనం స్పీడుగా బండి నడపడం, హెల్మెట్ పెట్టుకోకుండా రైడింగ్ చేయడం, పోలీసులు పట్టుకొంటే ఆ మేరకు చలాన్ కడుతుంటాం. ఇప్పుడు సరిపోయేటంత పెట్రోల్ లేకుండా డ్రైవింగ్ చేయడం వంటి పనికి కూడా చలాన్ కట్టాల్సి వచ్చింది.
కేరళలో ఇటీవల ఒక వ్యక్తి తన మోటార్‌సైకిల్ లో తగినంత ఫ్యూయల్ లేకుండా బండి నడిపినందుకు చలాన్ కట్టాడు. రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 మోటార్‌సైకిల్‌ను రయ్…మని ఆఫీస్ కి శ్యామ్ అనే వ్యక్తి వెళ్తుండగా, కేరళ స్థానిక ట్రాఫిక్ పోలీసులు వన్-వే రోడ్ లో ఎదురుగా వచ్చినందుకు అతన్ని పట్టుకుని ఆపారు. చేసిన నేరానికి 250 రూపాయలు ఫైన్ కట్టమన్నారు. మనోడు చలాన్ కట్టి హడావిడిగా ఆఫీసుకి వెళ్లాడు. అక్కడ చలాన్ ఓపెన్ చేసి చూస్తే, బండిలో తగినంత పెట్రోల్ లేకపోవటంతో ఫైన్ వేసాం అని పోలీసులు చలాన్ లో రాయటం చూసి అవాక్కయ్యాడు.