iDreamPost
android-app
ios-app

హిట్టొచ్చినా కుర్ర హీరో మౌనం

  • Published Oct 08, 2022 | 3:55 PM Updated Updated Oct 08, 2022 | 3:55 PM
  • Published Oct 08, 2022 | 3:55 PMUpdated Oct 08, 2022 | 3:55 PM
హిట్టొచ్చినా కుర్ర హీరో మౌనం

మాములుగా పెద్ద బ్లాక్ బస్టర్ వస్తే అందులో నటించిన హీరో హీరోయిన్ కాంబోకి ఆటోమేటిక్ గా క్రేజ్ వచ్చేస్తుంది. బిజినెస్ కూడా ఈజీగా జరిగిపోతుంది. ఇంకా చెప్పాలంటే అనుకున్న దానికన్నా ఎక్కువ మొత్తంలోనే పోగేసుకోవచ్చు. కానీ కుర్ర హీరో నిఖిల్ కార్తికేయ 2 ప్యాన్ ఇండియా లెవెల్ లో అంత సక్సెస్ అయ్యాక కూడా ఎప్పటి నుంచో వాయిదాలో ఉన్న 18 పేజెస్ ని ఇప్పటికైనా బయటికి తీసుకొచ్చే ప్రయత్నాలు కనిపించడం లేదు. ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ 2 నిర్మించిన ఈ లవ్ కం కాన్సెప్ట్ ఎంటర్ టైనర్ లో తనకు జోడిగా నటించింది అనుపమ పరమేశ్వరనే. సుకుమార్ రచన చేయగా కుమారి 21 ఎఫ్ ఫేమ్ సూర్య ప్రతాప్ దర్శకత్వం వహించాడు.

ఇప్పుడు ఈజీగా నిఖిల్ క్రేజ్ ని క్యాష్ చేసుకుని 18 పేజెస్ ని రిలీజ్ కు రెడీ చేయొచ్చు. కానీ ఫైనల్ కాపీ అంత సంతృప్తికరంగా రాలేదని అందుకే సుక్కు సూచనల మేరకు కొంత భాగం రీ షూట్ కి ప్లాన్ చేశారట. కార్తికేయ 2తో వచ్చిన మార్కెట్ ని కాపాడుకోవడం కీలకం కాబట్టి నిఖిల్ కూడా తన సమ్మతిని తెలిపినట్టు టాక్. ఇది కాకుండా స్పై అనే మరో ప్యాన్ ఇండియా మూవీ కూడా నిఖిల్ చేస్తున్నాడు. ఇది ప్రకటించి కూడా చాలా రోజులయ్యింది. ప్రస్తుతానికి ఎలాంటి అప్డేట్స్ ఇవ్వడం లేదు. రెండు క్రేజీ ప్రాజెక్టులు చేతిలో పెట్టుకుని ఇలా చేయడం ఊహించనిదే. ప్రతి సినిమాకు చాలా గ్యాప్ తీసుకుంటున్న నిఖిల్ నిదానమే ప్రధానం సూత్రం పాటిస్తున్నాడు కాబోలు.

ఈ లెక్కన వీటికి సంబంధించిన అప్డేట్స్ రావాలంటే కొంతకాలం ఆగక తప్పదు. మూడు రోజుల క్రితం జీ5 ఓటిటిలో వచ్చిన కార్తికేయ 2 ఆ ప్లాట్ ఫార్మ్ మీద వ్యూస్ లో కొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఇదంతా ఓకే కానీ 18 పేజెస్, స్పైలలో ఏది ముందు వస్తుందనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్. అయినా అల్లు అరవింద్, బన్నీ వాస్ లాంటి వాళ్ళ ఆధ్వర్యంలో తీసిన సినిమా ఇంత లేట్ కావడం వింతే. అసలే ఆ బ్యానర్ గత రెండేళ్లుగా అంతగా అచ్చి రావడం లేదు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లాంటి ఒకటి రెండు తప్ప చావు కబురు చల్లగా, మంచి రోజులు వచ్చాయి, పక్కా కమర్షియల్ ఇలా ఏది తీసుకున్నా అన్నీ ఫ్లాపులే. అందుకే ఈసారి తొందరపడటం లేదేమో

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetcasibomJojobetcasibomjojobetjojobetcratosroyalbetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabet