iDreamPost
android-app
ios-app

పెరిగిన పెట్రోలు- డీజిల్ ధరలు.. లీటరుకు ఎంత పెరిగిందంటే?

  • Published Jun 15, 2024 | 5:27 PM Updated Updated Jun 15, 2024 | 5:27 PM

Petrol, Diesel Prices: గత కొన్ని రోజులుగా దేశంలో చమురు ధరలు పెరుగుతు, తగ్గుతూ వస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా వాహనదారులకు ప్రభుత్వం ఓ బిగ్ షాక్ ను ఇచ్చింది. కాగా, రాష్ట్రంలో ఒక్కసారిగా పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెంచేశారు. ఇంతకి ఎక్కడంటే..

Petrol, Diesel Prices: గత కొన్ని రోజులుగా దేశంలో చమురు ధరలు పెరుగుతు, తగ్గుతూ వస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా వాహనదారులకు ప్రభుత్వం ఓ బిగ్ షాక్ ను ఇచ్చింది. కాగా, రాష్ట్రంలో ఒక్కసారిగా పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెంచేశారు. ఇంతకి ఎక్కడంటే..

  • Published Jun 15, 2024 | 5:27 PMUpdated Jun 15, 2024 | 5:27 PM
పెరిగిన పెట్రోలు- డీజిల్ ధరలు.. లీటరుకు ఎంత పెరిగిందంటే?

దేశంలో సామాన్య ప్రజలకు అడుగడుగున భారీ షాక్ లు తగులుతునే ఉన్నాయి. అసలే ఓ వైపు నిత్యావసరా ధరల పెరుగుదలతో ప్రజలు సతమతమవుతున్న క్రమంలో.. సామాన్యలకు మరో పిడుగు లాంటి వార్త అందింది. మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగాయి. దీంతో సామన్యులకు చుక్కలు కనిపిస్తున్నాయి. అసలు ఒక్కసారిగా ఇలా భారీగా పెట్రోలు ధరలు పెరిగిపోవడంతో.. అసలు వాహనాలు నడిపేది ఎలా అంటూ ఆందోళ చెందుతున్నారు. ఎందుకంటే.. ప్రస్తుతం కాలంలో ప్రయాణం చాల సులువు అయిపోయింది. ముఖ్యంగా వాహనాదరులకు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్లాలంటే కచ్చితంగా ఆ వాహనానికి పెట్రోల్, డిజీల్ అనేది చాలా ప్రధానమైనది. మరి అటువంటి చమురు ధరలు ఈ మధ్య ఆకాశాన్ని తాకుతున్నాయి. ప్రతిసారి లీటరు ధర పెంచుకుంటూ వాహనాదారులకు బిగ్ షాక్ ను ఇస్తున్నారు. ఈ క్రమంలోనే.. తాజాగా మళ్లీ రాష్ట్రంలో పెట్రోల్ డీజీల్ ధరలను ప్రభుత్వం భారీగా పెంచిది. అయితే ఈ ధరలు తెలుగు రాష్ట్రాల్లో మాత్రం అనుకుంటే పొరపాటే. ఇంతకి ఎక్కడంటే..

గత కొన్ని రోజులుగా చమురు ధరలు పెరుగుతు, తగ్గుతూ వస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా వాహనదారులకు కర్ణాటక ప్రభుత్వం భారీ షాక్ ను ఇచ్చింది. ఇక నుంచి  పెట్రోల్ , డీజిల్ ధరలను లీటరు రూ.3 కు పెంచుతున్నట్లు ప్రకటించింది. కాగా, ఈ చమురు ధరలను జూన్ 15వ తేదీ నుంచే పెంచుతున్నట్లు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటనను విడుదల చేసింది. అలాగే ఈ పెట్రోల్ ధరలు అనేవి తక్షణమే అమలులోకి వస్తాయని ఆర్థిక శాఖ కూడా విడుదల చేసిన నోటిఫికేషన్ లో పేర్కొంది. దీంతో ఇప్పటి నుంచి కర్ణాటక సేల్స్ ట్యాక్స్ (KST) పెట్రోల్‌పై 25.92 శాతం నుంచి 29.84 శాతానికి పెరగనున్నాయి.

అలాగే డీజిల్ పై 14.3 శాతం నుంచి 18.4 శాతానికి పెరిగుతున్నాయి. ఇక ప్రస్తుతానికి బెంగళూరులో లీటర్ పెట్రోల్ రూ.99.84కు విక్రయిస్తుండగా.. డీజిల్ ధర రూ.85.93గా ఉంది. కానీ, నేటి నుంచి అనగా శనీవారం జూన్ 15వ తేదీ నుంచి అమలులోకి వచ్చిన ధరల్లో.. లీటర్ పెట్రోల్ ధర రూ.  రూ.102.85కి చేరగా, లీటర్‌ డీజిల్‌ ధర రూ. 88.93కి చేరింది. ఇక ఏదీ ఏమైనా పెట్రోల్, డీజిల్ ధరలను ఒక్కోసారిగా భారీగా పెంచడమనేది  వాహనదారులకు మరింత భారంగా మారనుంది. మరి, కర్ణాటక ప్రభుత్వం భారీగా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.