iDreamPost
iDreamPost
కరాటే కళ్యాణి వివాదం రోజుకో మలుపు తిరుగుతుంది. ప్రాంక్ యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డిపై దాడితో మొదలు, ఇంటి గురించి గొడవ, పిల్లల్ని కిడ్నప్ చేస్తుందని కేసు.. ఇలా వివాదం రోజుకో మలుపు తీసుకుంటుంది. సోమవారం రాత్రి కరాటే కళ్యాణి ప్రెస్ మీట్ పెట్టి నేను పాపని దత్తత తీసుకోలేదు, నాపై కొంతమంది కుట్ర చేస్తున్నారు అంటూ వీటన్నిటికీ సమాధానం ఇచ్చింది.
తాజాగా కలెక్టర్ ని కలిసాను, ఈ గొడవ ఇక్కడితో ఆపేయండి అంటూ మీడియా ముందుకి వచ్చింది కళ్యాణి. మంగళవారం మధ్యాహ్నం హైదరాబాద్ కలెక్టరేట్ కి వెళ్ళింది కళ్యాణి. కలెక్టర్ ని కలిసి ఆ తర్వాత మీడియా ముందుకు వచ్చింది. కళ్యాణి మాట్లాడుతూ.. దత్తత అనే అంశమే లేనప్పుడు ఇంకా కేసులు ఏంటి? ఆ చిన్నారి నా దగ్గరే ఉంటుంది, ఆ పాప పేరెంట్స్ కూడా నా దగ్గరే ఉంటారు. కావాలనే ఎవరో నాపై దుష్ప్రచారం చేస్తున్నారు. నాకు ఎవరూ ఎలాంటి నోటీసు ఇవ్వలేదు. కలెక్టర్ ను కూడా కలిశాను. చైల్డ్ వెల్ఫేర్ కమిషన్ వాళ్ళని కలుద్దామంటే అధికారులు అందుబాటులో లేరు అని తెలిపింది.
ఇక్కడితో ఇష్యూ క్లోజ్ అయిపోయింది. నేను దత్తతే తీసుకోనప్పుడు లీగలా, ఇల్లీగలా అనే ప్రశ్న ఎక్కడిది? మీడియా వార్తలను వక్రీకరించి రాయొద్దు. శివశక్తి సంస్థ, అధికార పార్టీ నేతలు కొంతమంది నాపై కావాలని ఇలా ప్రచారం చేస్తున్నారు. కావాలనే నాపై కుట్ర చేసి, కేసులో ఇరికించాలని ప్రయత్నం చేస్తున్నారు అని కరాటే కళ్యాణి ఇవాళ మరోసారి మీడియాతో మాట్లాడింది.