iDreamPost
android-app
ios-app

దేవరపై కళ్యాణ్ రామ్ డేర్ కామెంట్స్! తారక్ ఫ్యాన్స్ కి పండగే!

Devara Movie: జూనియ‌ర్ ఎన్టిఆర్ హీరోగా తెర‌కెక్కుతున్న దేవ‌ర సినిమాపై అభిమానుల్లో భారీ అంచ‌నాలే ఉన్నాయి. తాజాగా, ఈ సినిమా గురించి హీరో నంద‌మూరి కళ్యాణ్ రామ్ కొన్ని ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

Devara Movie: జూనియ‌ర్ ఎన్టిఆర్ హీరోగా తెర‌కెక్కుతున్న దేవ‌ర సినిమాపై అభిమానుల్లో భారీ అంచ‌నాలే ఉన్నాయి. తాజాగా, ఈ సినిమా గురించి హీరో నంద‌మూరి కళ్యాణ్ రామ్ కొన్ని ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

దేవరపై కళ్యాణ్ రామ్ డేర్ కామెంట్స్! తారక్ ఫ్యాన్స్ కి పండగే!

నందమూరి వారసుడిగా టాలీవుడ్ కి ఎంట్రీ  ఇచ్చి.. తనదైన మార్క్ చూపించిన వ్యక్తి.. యంగ్ టైగర్ ఎన్టీఆర్. నటనలో తాతకు తగ్గ మనవడిగా తారక్ కి పేరుంది. ఆయన ట్రిపుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారారు. ఇప్పుడు తారక్ కి ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ట్రిపులార్ తరువాత తారక్ నటిస్తోన్న సినిమా దేవర. ఈ సినిమాను కోరటాల శివ తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీపై తారక్ అభిమానులతో పాటు సినీప్రియులల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా గురించి అప్‌డేట్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. తాజాగా, దేవర సినిమా గురించి నంద‌మూరి కళ్యాణ్ రామ్ కొన్ని ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఈ వ్యాఖ్య‌లు ప్రస్తుతం సోష‌ల్‌మీడియాను ఓ ఊపు ఊపేస్తున్నాయి.

టాలీవుడ్ హీరో  నందమూరి క‌ళ్యాణ్ రామ్  నటిస్తున్న మూవీ డెవిల్. ఈ సినిమా ట్యాగ్‌లైన్ ది బ్రిటిష్ సీక్రెంట్ ఏజెంట్‌. ఈ సినిమా డిసెంబ‌ర్ 29 న ప్రేక్షకుల ముందుకు రానుంది. బింబిసార హిట్ తో మంచి ఊపు మీద ఉన్న కల్యాణ్ రామ్.. మరో హిట్ కోసం ఎదురు చూస్తున్నారు. డెవిల్ సినిమా కూడా  సూపర్ హిట్ అవుతుందని టీమ్ బలంగా చెబుతుంది. ఇది ఇలా ఉంటే మూవీ ప్రమోషన్లలో భాగంగా కల్యాణ్ రామ్ పలు ఇంటర్వూల్లో పాల్గొంటున్నారు. అంతేకాక డెవిల్ సినిమాకు సంబంధించిన విశేషాలను కల్యాణ్ రామ్ షేర్ చేసుకుంటున్నారు. అలానే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కల్యాణ్.. దేవర సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

kalyan ram comments on devara movie

ఇంటర్వ్యూలో కల్యాణ్ రామ్ మాట్లాడుతూ..” దేవర సినిమా 80 శాతం షూటింగ్ పూరైంది. దేవర సినిమా రెండు పార్టులో వస్తుంది. అయితే తాము దేవర పార్ట్ -1 మీదనే ఫోకస్ పెట్టాము. ఈ సినిమా విజువల్స్ చాలా అద్భుతంగా ఉంటాయి. నాకు తెలిసి తెలుగులో అలాంటి  విజువల్స్ ఎప్పుడూ చూడలేదు. అలాంటి మంచి అవుట్ పుట్ కోసం ఎంత రీసెర్చ్ చేశామో మాకు తెలుసు. విజువల్స్ రియలిస్ట్ గా అనిపించేందుకు తమ్ముడు తారక్ ఎంతో తపన పడ్డాడు. ఇలా ఆర్ అండ్ డీ, రీసెర్చ్,  సెట్టింగ్స్, యూఎస్ఏ నుంచి టీమ్స్ ను తెప్పించాము. అలానే ఫైట్స్ విషయంలోను ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. ఈ సినిమాలోని విజువల్స్ రియాలిస్ట్ గా కనిపించేందుకు ఎంతో అద్భుతంగా రూపొందిస్తున్నాము.

ఇక్కడ మరో విషయం చెప్పాలంటే.. ట్రిపుల్ ఆర్ సినిమా తరువాత ఎన్టీఆర్ ఏడాదిన్న పాటు సినిమా చేయలేదు. కారణం.. తరువాత మనం ఇచ్చే సినిమా చాలా కొత్తగా ఉండాలని భావించాడు. అందుకే సినిమాను హడావుడిగా కాకుండా ఎంతో కమిట్ మెంట్ తో చేస్తున్నాము. అప్ డేట్ కోసం హడావుడిగా ఇస్తే.. జనాలు ఏమంటారు.. ఏమి ఇలాంటి సినిమా మాకు ఇస్తారని అంటారు. ఇలా ఒక మంచి సినిమా ఇవ్వాలనే పెద్ద ఒత్తిడి తారక్ , కోరటాల శివ, నిర్మాత హరి, అలానే నాపై ఉంది. అంతా సూపర్ గా అందించాలనే  తపనతో, బాధ్యత తీసుకోవడం వలన చాలా ఒత్తిడికి గురవుతున్నాము.

దేవర సినిమాలో అన్ని ఎనర్జీలు కలుస్తాన్నాయి.  ఈ సినిమా కోసం రేయింబవళ్లు కష్టపడుతున్నాము. ఇంకా చెప్పాలంటే పూణేలో ఉన్న సెటప్  కోసం ప్రతిసారి  వెళ్లలేక.. ఇక్కడే తయారు చేయించాము. దానిని తయారు చేయించేందుకు నాలుగు నెలల పట్టింది. దేవర సినిమా ప్రత్యేకంగా, అద్భుతంగా ఉంటుంది” అని కల్యాణ్ రామ్ చెప్పుకొచ్చారు. ఇక కల్యాణ్ రామ్ చెప్పిన మాటల ప్రకారం చూస్తే.. తారక్ అభిమానులు కాలర్ ఎగరేయవచ్చు. ఇప్పటికే  సినిమాపై అభిమానుల్లో ఓ రేంజ్ లో అంచనాలు ఉన్నాయి. తాజాగా కల్యాణ్ రామ్ చెప్పిన మాటలతో.. అంచనాలు తారాస్థాయికి చేరాయి. దీంతో దేవర సినిమా కోసం అభిమానులు ఈగర్ గా ఎదురు చూస్తున్నారు. మరి.. దేవర మూవీపై కల్యాణ్ రామ్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibombetpark girişjojobet girişjojobet girişdeneme bonusu veren sitelerMadridbetMadridbetJojobetJojobetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabetJojobetGrandpashabetJojobet Girişmarsbahis