iDreamPost
android-app
ios-app

అప్పుడు కైరో.. ఇప్పుడు కెనైన్

అప్పుడు కైరో.. ఇప్పుడు కెనైన్

అగ్రరాజ్యం అమెరికాతో పాటు పలు దేశాలను వణికించిన ఇద్దరు మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు శునకాల చేతి లో హతమయ్యారు. అమెరికా లోని ట్విన్ టవర్స్ ను కూల్చిన అల్కాయిదా అధినేతను 2011 లో అమెరికా సేనలు పాకిస్థాన్ లో మట్టుపెట్టాయి. ఆ పరేషన్ లో కైరో అనే అమెరికా మిలటరీ శునకం కీలక పాత్ర పోషించింది. బిన్ లాడెన్ ను కనిపెట్టి కైరో తరిమింది. తాజాగా ఐసిస్ అధినేత అబు బాకర్‌ అల్‌ బాగ్దాదీఆచూకీ కనిపెట్టి హతమార్చడం లో కెనైన్ అనే అమెరికా మిలటరీ శునకం ముఖ్య పాత్ర పోషించి వార్తల్లో నిలిచింది. ఈ క్రమంలో ఒసామా బిన్‌ లాడెన్‌ను తరిమిన కైరో అడుగుజాడల్లో కెనైన్‌ నడిచి మరో ఉగ్రవాదిని హతం చేయడంలో కీలకంగా వ్యవహరించిందంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు. కెనైన్ ను పొగుడుతూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ట్విట్ చేశారు. 

తమ వీర శునకం గురించి ట్రంప్ మాట్లాడుతూ… ‘ మా కెనైన్‌.. కొంతమంది దానిని కుక్క అంటారు.. మరికొంత మంది అందమైన కుక్క అంటారు… ఇంకొంత మంది ప్రతిభావంతమైన కుక్క అంటారు… తను గాయపడింది. ప్రస్తుతం దానిని వెనక్కి తీసుకువచ్చాం’ అని పేర్కొన్నారు. మంగళవారం దాని ఫొటోను ట్విటర్‌లో షేర్‌ చేశారు. ఐసిస్‌ చీఫ్‌ అబు బాకర్‌ అల్‌ బాగ్దాదీని పట్టుకోవడంలో, అతడిని హతమార్చడంలో కీలక పాత్ర పోషించింది’ అని ఆయన ట్వీట్‌ చేశారు.